హిందీ సాహిత్య చరిత్ర - 4
హిందీ
సాహిత్య చరిత్ర - 4
హిందీ మూలం : డా. ఋషభ్ దేవ్
శర్మ
తెలుగు
అనువాదం : డా.
యస్.వి.యస్. యస్. నారాయణ రాజు
हिंदी मूल :
डॉ. ऋषभ देव शर्मा
तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू
स्रवंति / స్రవంతి
नवंबर 2003 / నవంబరు 2003
( హిందీ
సాహిత్య విశేషాలను తెలుగు పాఠకులకు, తెలుగు సాహిత్య రీతులు మరియు తీరుతెన్నులను
గురించి హిందీ పాఠకులకు అందించి తద్వారా జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే
స్రవంతి ద్విభాషా మాసపత్రిక యొక్క లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో ఒక
భాగంగా హిందీ సాహిత్య చరిత్రను తెలుగు
పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ శీర్షకను ప్రారంభించడం జరిగింది. హిందీలో ఉచ్ఛ
శిక్ష ఔర్ శోధ్ సంస్ధాన్,
హైదరాబాద్ శాఖ రీడర్ డా. ఋషభ్ దేవ్ శర్మ గారు వ్రాసిన “హిందీ
సాహిత్య కీ రూప్ రేఖా”
ను తెలుగులో “హిందీ
సాహిత్య చరిత్ర”
పేరిట డా. యస్.వి.యస్.యస్. నారాయణ రాజు గారు అనువాదం చేశారు. ఇకపై ప్రతి నెలా
హిందీ సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి సంపూర్ణ హిందీ సాహిత్య చరిత్రను గూర్చి
తెలుసుకునేందుకు వీలుగా క్రమంగా ప్రచురించడం జరుగుతుంది. సంపాదకులు)
(4)
రాసో సాహిత్యము : ఆదికాలములో రాసో సాహిత్య పరంపరలో మూడు
రకాలయినటువంటి కావ్యాల రచన జరిగినది.
(1) జైనరాస్ కావ్యాలు : ఇందులో
ఆధ్యాత్మిక దృష్టి ప్రాధాన్యత వహించింది.
(2) వీర్ గాథా రాసో కావ్యాలు : ఈవిధమైన
రచనలు ఆస్థానకవులు రచించినటువంటివి మరియు ఇటువంటి కావ్యాలలో రాజు మరియు కవి యొక్క
మరణానంతరం ఈ కావ్యాలు యొక్క ప్రచారం జరిగినది.
(3) ప్రేమకథా రాసో కావ్యాలు : వీటిని
సందేశ కావ్యాల పరంపరలో కూడా పరిగణించడం జరిగినది. హిందీ సాహిత్యం యొక్క వివిధ
చరిత్ర గ్రంథాలలో ఆదికాలములోని జైనేతర రాసోకావ్యాలను మూడు వర్గాలుగా విభజించటం
జరిగినది. 1. అస్థిత్వ హీన్ రాసో
కావ్యాలు (హమ్మిర్ రాసో) 2. పరవర్తీ కాలీన్ రాసో కావ్యాలు (కుమాణ్ రాసో, పరమాల్
రాసో) 3. ప్రామాణికమైనటువంటి ఆదికాలపు రాసో కావ్యాలు (పృధ్వీరాజ్ రాసో, బీసల్ దేవ్
రాసో).
4.1
హమ్మిర్ రాసో (శాంగధర్ మరియు జజ్వల్) :- హమ్మిర్
రాసో ఒక అలభ్యమైనటువంటి కావ్యము. దీనిలోని కొన్ని పద్యాలు ప్రాకృతపైంగలమ్ లో
సంకలించబడ్డాయి. ఆచార్య రామ చంద్ర శుక్ల్
అభిప్రాయం ప్రకారం ఇందులో హమ్మిర్ మరియు అల్లాఉద్దీన్ మధ్య జరిగిన యుద్ధ
కథలు అయి ఉండవచ్చును. దీనిని ఈయన శాంగధర్ యొక్క రచనగా స్వీకరించారు కాని రాహుల్
సాంకృత్యాయన్ పై పద్యాలను జజ్వల్ యొక్క రచనలుగా స్వీకరించారు. డా. హజారీ ప్రసాద్
ద్వివేదీ అభిప్రాయం ప్రకారం దీనిలోని నాయకుడు అమీర్ అయి ఉంచవచ్చును. ఈ అస్థిత్వహీన రాసో కావ్యాము యొక్క రచనాకాలము
స్వాభావికముగానే అజ్ఞాతము.
4.2
ఖుమాణ్ రాసో (దళపతి విజయ్) :– ఆచార్య
రామచంద్ర శుక్ల్ ఈ రచన 9వ శతాబ్దానికి చెందినటువంటి చిత్తౌడ్ రాజు కుమాణ్ రాజు
యొక్క యుద్ధ సంబంధిత వీర కథలుగా
గుర్తించారు. కాని తరువాత తెలియవచ్చినదేమిటంటే ఇది 17 వ శతాబ్దపు రచన అని మరియు
దీని యొక్క కవి దళపత్ విజయ్ ఎందుకంటే ఇందులో 17వ శతాబ్దానికి చెందిన చిత్తౌడ్ రాజు
రాజ్ సింగ్ యొక్క వర్ణన ఉంది. 5000 పద్యాలతో రచించబడిన ఈ విశాలకావ్యంలో రాజుల
యొక్క యుద్ధాలు, వివాహాలు వివిధ నాయికా మరియు ఆరు ఋతువుల యొక్క సుందర వర్ణన
ఉన్నది. ఇది ఒక ప్రసిద్ధ కావ్యాము. ఇందులో వీర మరియు శృంగార రసాల యొక్క
సమ్మిశ్రణము కానవస్తుంది. రాజస్తానీ హిందీలో రచించినటువంటి ఖుమాణ్ రాసోలో దోహా,
సవైయ్యా మరియు కవిత్త ఛందస్సులు ప్రధానమైనవి. దీనియొక్క భాష ఆదికాలపు తరువాతి
భాషగా తెలుస్తుంది.
4.3
పరమాల్ రాసో లేదా ఆల్హ్ ఖండ్ (జగనిక్) :– జగనిక్
కవి ద్వారా రచించనటువంటి ఆల్హా లేదా పరమాల్ రాసో ఒక జానవద గేయకావ్యము. దాని యొక్క
మూల ప్రతి లేకపోవటం వలన వర్తమానకాలపు రూపాన్ని ఆదికాలీన రచనగా గుర్తించడంలేదు.
జగనిక్ కవి మెహాబా రాజైనటువంటి మర్దిదేవ్ (రాజాపరమాల్) యొక్క రాజకవి. ఇందులో కవి
వీరసామంత రాజులైనటువంటి ఆల్హా మరియు అదల్ చేసినటువంటి అనేక యుద్ధాల యొక్క వర్ణనలను
చేశాడు. ఈ యుద్ధాలు వివాహాల కొరకు ప్రతీకార వాంఛలు తీర్చుకోవటం కోసమే జరిగాయి. ఈ
కావ్యాము యొక్క మూలరూపము లభించినప్పటికీ కావ్య భాషాపరంగా పరమాల్ రాసో
ధ్వన్యాత్మకత, వర్ణనశైలి, వీర రసంతో నిండినటువంటిది.
బారహ్
బరస్ లైకూకర్ జీవై, అరూ తేరహ్ వేం జియైసియారా
బరస్
అఠారహ్ క్షత్రియ్ జీవై, ఆగే జీవన్ కో ధిక్కార్.
4.4
పృథ్వీరాజ్ రాసో (చంద్ బర్ దాయి) :–
పృథ్వీరాజ్ రాసో ప్రథమ హిందీ మహాకావ్యము. దీని యొక్క రచన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క
ఆంతరంగిక మిత్రుడు. వీర సామంత రాజైన చందబరదాయి 12 వ శతాబ్దంలో రచించాడు. ఈ కృతి
యొక్క చారిత్రాత్మక
విషయాలపైన అనేక సందేహాలున్నప్పటికీ ఈ రోజున దీనిని ప్రామాణికమైన చారిత్రాత్మక రాసో
కావ్యంగా స్వీకరించటం జరిగినది. ఇందులో కవి పృథ్వీరాజ్ చౌహాన్ చేసినటువంటి యుద్ధాల
గురంచి అతిశయోక్తితో కూడిన వర్ణనలను చేశాడు. ఈ కావ్యానికి సంబంధించినంతవరకు నాలుగు
వేర్వేరు ప్రతులు ఉన్నయి. ఇందులో దేనిలో ఎంతభాగం చంద్ బరదాయి రచించనదో నిర్ణయించటం
చాలా కష్టతరమైనటువంటిది.
పృథ్వీరాజ్ రాసో చారిత్రక ప్రామాణికతకు
వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవారు. యిందులోని అనేకమైన సంఘటనలు, వ్యక్తులు మరియు
వంశాల యొక్క పేర్లు చరిత్రలో లేవు అని నిర్ధారించారు. పృథ్వీరాజ్ ను దత్తత తీసుకోవటము
రాణి సంయోగిత స్వయంవరం చరిత్రలో కన్పించలేదు. ఇంతే కాకుండా పృథ్వీరాజ్ చౌహాన్
చేసుకున్నటువంటి 14 వివాహాలు, భీమ్ సింగ్, సోమేశ్వర్ మరియు మహమ్మద్ ఘోరీలను చంపటం
కూడా చరత్రలో లేదు. ఇందులో యిచ్చినటువంటి తేదీలకు, చారిత్రక ఆధారాలకు మధ్య 90-100
సంవత్సరాల వ్యత్యాసం ఉంది.
పైన వివరించనటువంటి విమర్శలకు సమాధానంగా అసలు
చరిత్రలో పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కాలానికి సంబంధించనటువంటి ప్రామాణికత ఏమైనా ఉందా
అని ప్రశ్నించినచో దానికి సమాధానము లేదు. సమాజంలో ప్రజల మధ్య ఉన్నటువంటి ఆధారాలను
ఎంతమాత్రమూ ఉపేక్షించరాదు. ఇంతే కాకుండా మనము గమనించవలసిన విషయము ఏమిటంటే
పృథ్వీరాజ్ రాసో చారిత్రక గ్రంథం కాదు. ఇది కేవలం ఒక రాజస్థాన కవి రచించటువంటి
మహాకావ్యము. ఇందులో అనేక కల్పనలతో కూడిన అతిశయోక్తిపూర్ణమైన వర్ణనలు ఉండటం చాలా
సహజమైన విషయము. 13 వందల పద్యాలతో కూడిన చిన్న కావ్యప్రతిలో చారిత్రక దోషాలు కన్పించవు.
అయితే దీనిని అభివృద్ధిపరచిన విస్తృత కావ్యప్రతిలోనే అనేకమైనటివంటి దోషాలు
ఉన్నాయి. ఇందువలన డా. దశరధ్ శర్మ 13 వందల పద్యాలతో కూడిన చిన్న ప్రతినే
మూలకావ్యంగా గుర్తించారు. తేదీలకు సంబంధించిన వ్యత్యాసాలను ఖండిస్తూ మోహన్ లాల్
విష్ణులాల్ పాండ్యగారు ఇలా అన్నారు. “పృథ్వీరాజ్ రాసో లోని తేదీలు ఆనంద్ సంవత్ ప్రకారము ఉన్నాయి. చరిత్రలో
స్వీకరించనటువంటి శకానికి ఆనంద్ సంవత్ కి మధ్య 90-100 సంవత్సరాల వ్యత్యాసం ఉంది.
డా.హజారీ ప్రసాద్ ద్వివేదీ, కావ్య భాషను ఆధారంగా చేసుకుని పృథ్వీరాజ్ రాసో యొక్క
ప్రామాణికతను గుర్తించడానికి ప్రయత్నించారు. వారి అభిప్రాయం ప్రకారం మూల కావ్యము. ‘శుక్-శుకీసంవాద్’ రూపంలో
రచించటం జరిగింది” ఈ
శైలిలో లేనటువంటి అంశాలన్ని తరువాత కాలంలో చేర్చబడివని. వీటిలోనే చారిత్రక
వ్యతిరేకమైన సంఘటనలు కన్పిస్తాయి. ఆయన “సంయుక్తాక్షరమయి అనుస్వారాంత్” భాషా
ఆధారంగా పృథ్వీరాజ్ రాసో ను 12వ శతాబ్దంలో రచించనటువంటి ప్రామాణిక కావ్యంగా
గుర్తించారు.
పృథ్వీరాజ్ రాసో ఒక చరిత్ర ప్రధానమైన కావ్యము
ఇందులో వీర, శృంగార రసాల యొక్క సంపూర్ణ సమ్మేళనము కన్పిస్తుంది. పృథ్వీరాజ్ చౌహాన్
వ్యక్తిత్వానికి చెందిన రెండు పక్షాలు ఇందులో కన్పిస్తాయి. మొత్తం కావ్యానికి
కేంద్ర బిందువు స్త్రీ. ఎందుకంటే శృంగారానికి మరియు యుద్ధాలకు మూలబిందువు స్త్రీ,
నగరాలు, ఉద్యానవనాలు, సరోవరాలు, కోటలు మరియు యుద్ధాల యొక్క సజీవ వర్ణనలు యిందులో
ఉన్నాయి. వ్రజ్ మరియు రాజస్థానీ మాండలికాల కలయికతో కూడిన పింగళ్ శైలి యొక్క
ఉత్కృష్ట రూపము కన్పిస్తుంది. ఈ కావ్యం ద్వారా తెలియవచ్చేదేమిటంటే చంద్ బరదాయి ఒక
దేశ భక్తితో కూడినటువంటి దూరదృష్టి కలిగిన కవి. అతడు విలాసాలలో మునిగి
తేలుతున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ ను హెచ్చరిస్తూ ఈ విధంగా చెప్పాడు.
“గోరీ రత్త ఉంతువ ధరా, తూ గోరీ అనురత్త” అనగా హే
రాజా నువ్వు గోరి(నాయిక) పట్ల అనురక్తితో ఉన్నావు. కాని మహమ్మద్ ఘోరి భూమి మరియు
ప్రజలను చెరపెడుతున్నాడు. ఇదే విధంగా పృధ్వీరాజ్ చౌహాన్ ను మహమ్మద్ ఘోరి
బంధించినప్పుడు కూడా మహాకవి చంద్ బరదాయి భారతీయ రాజులను ఆహ్వానిస్తూ ఇలా అన్నాడు. “పృథ్వీరాజ్
దేవ్ దువన్ గహాఉరే, ఛత్తీఅ కర్ ఖగ్గా గహున్” అనగా ఓ క్షత్రియ వీర పుత్రులారా శత్రువు పృథ్వీరాజ్
చౌహాన్ ను బంధీగా పట్టి బంధించాడు.
ఇప్పుడు మీ చేతులలోని కరవాలాలకు పని చెప్పండి. కాని దురదృష్టవశాత్తూ ఈ మహాకవి
యొక్క పిలుపు అహంకారము ద్వేషము, విలాసము, మరియు స్వార్థంతో నిండి ఉన్నటువంటి
అప్పటి క్షత్రియులు పట్టించుకోలేదు. దాని ఫలితమే అనేక శతాబ్దాలు భారతదేశము దాస్య
శృంఖాలాలలో ఉండవలిసి వచ్చినది. వాస్తవంగా పృథ్వీరాజ్ రాసో హిందీ మహాకావ్య పరంపరలో
ప్రథమ మహాకావ్యంగా అద్వితీయ స్థానాన్ని అలంకరించినది మరియు దాని యొక్క సందేశము
ఆనాటి పరిస్థితులకు ఎంత ఉపయోగకరమయినదో నేటికి కూడా అది అంతే ఉపయోగకరమయినది.
4.5
బీసల్ దేవ్ రాసో ( నరపతి నాల్హ్) :– ఇది
క్రీ.శ 1155 మరియు 1215ల మధ్య రచించినటువంటి బీసల్ దేవ్ రాసో యొక్క ప్రేమకథకు
సంబంధించిన రాసో కావ్యము. ఇందులో అజ్మీర్ మరియు సాంబార్ రాజైన బీసల్ దేవ్ మరియు
రాణి రాజమతిల వైవాహిక జీవితానికి సంబంధించిన వర్ణనలతో కూడినటువంటిది. బీసల్ దేవ్ గర్వంతో నా
రాజ్యంలో ఉప్పు గని ఉంది అని అంటే దానికి జవాబుగా రాణి ఒరిస్సా రాజు యొక్క
రాజ్యంలో వజ్రాలగని ఉంది అని అంటుంది. దీనితో హతాసుడైన బీసల్ దేవ్ రాజ్యం వదిలి
ఒరిస్సా వెళ్ళిపోతాడు. 12 సంవత్సరాల
తరువాత తిరిగివస్తాడు. 128 పద్యాలతో కూడిన ఈ చిన్న కావ్యంలో కవి రాణీరాజమతి ద్వారా
స్త్రీ జీవితానికి సంబంధించిన బాధలు మరియు స్త్రీ సౌశీల్యము యొక్క మహిమను గురించి
వర్ణించాడు. ఈ కావ్యాన్ని ‘సందేశ్
కావ్య్’
పరంపరలో కూడా గుర్తించటం జరిగినది. ఇది ఏవిధముగాను వీరకథకాదు గాని విరహకథ. స్త్రీ
జాతి పట్ల కవి యొక్క సహానుభూతి ఈ కావ్యము యొక్క విశేషము. ఈ కావ్యంలో నాయిక ఈ విధముగా
ఉంటుంది. “హే
భగవంతుడా నీవు నాకు స్త్రీ జన్మము ఎందుకిచ్చావు దీనికి బదులుగా అడవిలో నల్లని
కోయలగా జన్మనిచ్చినిచో తన యిష్ఠానుసారము వృక్ష శాఖలపై కూర్చొనవచ్చును”.
నరపతి నాల్హ్ రచించిన ఈ కావ్యంలో మానవజీవితానికి సంబంధించిన అనేక విషయాల యొక్క సహజ
వర్ణనలు ఉన్నాయి.
(5) జానపద సాహిత్యము :- ఆదికాలపు
సాహిత్యంలో జానవద సాహిత్యపు ప్రవృత్తి కూడా కన్పిస్తుంది. ఈ కాలములోని ‘డోలా మారూ
రాదూహ’
ప్రసిద్ధి చెందిన జానపద మహాకావ్యము. చరిత్రకారులు దీనిని 11వ శతాబ్దపు రచనగా
గుర్తించారు. తరువాత దీనిని 17వ శతాబ్దంలో కుశల్ రామ్ కథావాచక్ దీనిని
విస్తృతపరచాడు. మర కొందరి అభిప్రాయం ప్రకారం14-15 శతాబ్దాలలో కల్లోల కవి దీనిని
రచించాడని పేర్కొన్నారు. జానపద కావ్యాల కవుల యొక్క సమయములో అనిశ్చితత ఉండటం చాలా
సహజమైన విషయము. ఇందులో రాజకుమారుడైన డోలా మరియు రాజకుమారి మార్వణిల విరహము మరియు కలయికల
వర్ణన ఉంది. ఆదికాలపు శృంగార కావ్యపరంపరలోని ఇది ఒక కావ్యము. ఇందులోని స్త్రీ
హృదయం యొక్క కోమలత్వాన్ని సాత్విక ప్రేమతోపాటు సంస్కృత పరంపరలోని ఋతువర్ణన జానవద
పరంపరలోని దోహాలు కూడా ఉన్నాయి.
ఆదికాలపు జానపద సాహిత్యంలో భట్ట్టరచించినటువంటి ‘జయచంద్రప్రకాశ్’ మధురకవి రచించిన ‘జయమయంక్ జస్ చంద్రిక’ మరియు అజ్ఞాత కవి రచించిన వసంత విలాసము ప్రముఖ్య కావ్యాలు. ఆదికాలపు జానపద కావ్యాల యొక్క వర్ణన అమీర ఖుస్రో (1255-1324) ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లాలోని పటియాలా గ్రామానికి చెందినవాడు. ఇతడు సహృదయుడే కాక వినోదప్రియుడు, జన జీవితంలో పూర్తిగా విలీనమయిపోయినాడు. ‘ఖాలీకబారీ’ తో పాటుగా పహేలియోం, ముఖరియోంతో పాటు గజల్ క్షేత్రాల్లో ఖుస్రో సుమారుగా 100 రచనలు చేశాడు. అందులో 20-21 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఆయన పహేలియోం, ముఖరియోం ద్వారా అత్యధిక ఖ్యాతి నార్జించాడు. తరువాత కాలంలోని రహస్యవాది కావ్యాలపైన ఈయన ప్రభావం పడంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే అమీర్ ఖుస్రో ‘ఖడీబోలీ’ యొక్క ప్రథమ కవిగా గౌరవాన్ని పొందాడు.