నల్లబజారు






నల్లబజారు

మణిపురి మూలం : డా. చోం. యామినిదేవి    
मणिपूरि मूल : डॉ. चों. यामिनि देवी  
           
  హిందీ అనువాదం : డా. ఇ.విజయలక్ష్మీ
हिंदी अनुवाद : डॉ. इ. विजयलक्ष्मी   
                      
తెలుగు అనువాదం : డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు
             तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू 
   
స్రవంతి. ద్విభాషా మాస పత్రిక,
నవంబరు, 2006    
                                                        
     ఈ రోజు సినిమా బహుశ చాలా బాగున్నట్టుంది. అందువలన టిక్కెట్లు దొరకడం కష్టంగా ఉంది. లోపలి సినిమాలో ఏమి చూపిస్తున్నారో తెలియడంలేదు. సినిమా హాలు బయట పోస్టర్ లో మాత్రం తక్కువ బట్టలు దరించిన స్త్రీ, టార్జాన్ లాగా కండలు తిరిగిన మగవాడు ఒరకినొకరు కౌగిలించుకుని ఉన్న దృశ్యం ఉంది. దీని వలన హాలు బయట విపరీతంగా జనం ఉన్నారు. ఈ రద్దీ కారణంగా ఒక ముసలి వ్యక్తికి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ పాలు అయినాడు.

 టికెట్ కౌంటర్ లోకి సుమతి మరియు ఇంకొక ఇద్దరు మగ పిల్లలు ఒకేసారి చేతులు పెట్టారు. అరే, చెయ్యి తీసుకోనివ్వండి రా!” అని సుమతి అన్నది.

బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు అమ్మే సిగ్గులేనిదానా, నువ్వు ముందు చెయ్యితీయవే.

ఈవిధంగా తిట్లపురాణం మధ్య ఎలాగోలాగా కష్టపడి సుమతి టిక్కెట్లు సంపాదించింది. సుమతి వివాహం అతి చిన్న వయస్సులోనే అయిపోయింది. అప్పుడు ఆమె సిటీ గర్ల్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నది. ఒకరోజు స్కూలు నుండి వస్తున్నప్పుడు జితిన్ ఆమెను అపహరించుకుపోయాడు. అయిదురోజుల వరకు వారి జాడ తెలియరాలేదు. ఇంకెవరైనా అయివుంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం, ఇంకా చాలా హంగామా జరిగి ఉండేది. సుమతి తల్లితో చుట్టు ప్రక్కల వాళ్ళు ఇలా అన్నారు – అమ్మాయి, ఒక్కసారి లేచిపోయింది అని తెలిస్తే, ఇంకేమైనా ఉందా? మొత్తం కుటుంబం పరువు పోతుంది. దీనిని మరికొంచెం సాగదీస్తూ, ఇంకోకరు – ఇంకేమైనా ఉందా? ఆడపిల్ల చిన్న తప్పు చేసినా ఇంక అంతే, పది తప్పులు చేసిన మగమహారాజులకైతే చెల్లిపోతుంది.

     సమాజంలోని ఇతరులకు భయపడిన సుమతి తల్లితండ్రులు మరొక గత్యంతరం లేక చివరికి వారికి పెళ్ళి  చెయ్యడానికి రాజీ పడ్డారు.

 పెళ్ళి అయిన కొద్దిరోజులలోనే రెండు, మూడు సార్లు పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ప్రతిసారి తల్లి నెమ్మదిగా ఒప్పించి అత్తవారింట్లో దించి వస్తూ ఉండేది. అంతేకాక సుమతితో  చూడమ్మ ఆడపిల్ల జీవితంలో ఒకరినే వరించాలి. పతియే ప్రత్యక్షదైవం కష్టమైనా, సుఖమైనా కలిసే అనుభవించాలి.
తల్లిమాట ప్రకారం కలిసి ఉండటం ప్రారంభించింది. ఈక్రమంలో 8 మంది పిల్లలకు తల్లి అయ్యింది. జితిన్ పనిదొంగే కాక త్రాగుబోతు కూడా. త్రాగడంతో పాటు తిరుగుబోతు కూడా. సుమతి అత్తమామలు ఉన్నప్పుడు కన్నా వారు చనిపోయిన తర్వాత సుమతికి ఇంకా కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఇంటి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోవడం ప్రారంభం అయింది. జితిన్ తన దురాలవాట్లకు ఇంట్లోని వస్తువులన్నింటిని ఒక్కొక్కటిగా కరిగించేవాడు. ఇంటిభారం మొత్తం పూర్తిగా సుమతిపైనే పడింది. ఇంటిని నడపడమేకాక మధ్య మధ్యలో భర్తను శాంతింప చేయడానికి కూడా డబ్బులు ఇవ్వవలిసివచ్చేది. ఆమె జీవితంలోని కష్టాలకు అంతులేకుండా పోయింది. ఇంటిని నడపడానికి ఆమె అనేక రకాలు అయిన పనులను చేసింది. అయితే ఏ పని కూడా ఆమె కష్టాలను తీర్చలేకపోయింది. కొన్నిరోజులు బట్టలు నేసింది, అయినా ఏమీ ఫలితం లేదు, కొన్నిరోజులు పాలవ్యాపారం చేసింది. దురదృష్టవసాత్తు పాలవ్యాపారం కూడా కలిసిరాలేదు. కొన్ని రోజులు దూరప్రాంతాలు నుండి కూరగాయలను కొని తెచ్చి క్యాయరామ్ బంద్ బజారులో అమ్మడం ప్రారంభించింది. తన చిన్న పిల్లని వీపుకు కట్టుకుని విపరీతమైన జనంతో నిండి ఉన్న బస్సులో వెళ్ళిరావలిసి వచ్చేది. ఎర్రటి ఎండలో బజారులో ఒకప్రక్క చిన్నపిల్లని నిలబెట్టి కూరగాయలు అమ్మవలిసి వచ్చేది. పిల్ల ఏడ్చినప్పుడు సీసాలో కొంచెం టీ పోసి త్రాగిస్తూ ఉండేది.
బజారులో అమ్మడానికి  తనకి జాగా లేకపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలిసి వచ్చింది. ఈ రోజు ఇక్కడ అమ్మితే రేపు ఇంకొక చోట అమ్మవలిసి వచ్చేది. అనేక సార్లు పోలిసుల బెదిరింపులకు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇంకా వర్షాకాలం వచ్చింది అంటే ఆమె కష్టాల కడలికి అంతేలేదు.
 ఒకరోజు ఒక దుకాణం ముందు కూర్చొని అమ్మడం ప్రారంభించిందో లేదో, ఆ దుకాణంలోని కూరగాయలు అమ్మే స్త్రీ వచ్చి, సుమతి కూరగాయలు అన్నింటిని పారవేస్తూ – ఎంత ధైర్యమే, నా దుకాణం ముందే అమ్ముతావా? ఇంత చిన్న జాగాకి నేను నెలకి ఐదువందలు అద్దెకడుతున్నాను, ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చావో, నీ అంతుచూస్తాను అని అన్నది.

       సుమతి ఒక్కసారి స్కూలు దగ్గర రోడ్డు వేస్తుంటే అక్కడ కూడా రెండు మూడు రోజులు కూలీ పనిచేసింది. ఒకరోజు విపరీతంగా వాన పడింది. మర్నాడే ఆ రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విధ్యాశాఖామాత్యూలు వారు వేంచేస్తుండటంతో రోడ్డు పని పూర్తి చేయమని విపరీతంగా అందరి కూలీలను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ అక్కడ అధికారి అందరిని అవసరానికి మించి తూలనాడటం ప్రారంభించాడు.
    
  వీర నారమణిగా గుర్తింపు పొందే మైతీ తైమా (మహారాణి గా గుర్తింపు పొందే మైతే జాతిస్త్రీ) ఈ రోజు కూలీగా మారింది. కాని కూలీ డబ్బులు కూడా పూర్తిగా చేతికి రావటం లేదు. సుమతి కొన్ని రోజులు కూలీగా పనిచేసింది అయితే సిమెంట్ దొరకపోవడంతో పని మధ్యలోనే ఆగిపోయింది.

  రాత్రి నుండి సుమతి చిన్న కూతురికి తీవ్ర జ్వరం వచ్చింది. నిమాయి మందుల షాపు నుండి మూడు మాత్రలు తెచ్చి వేసినప్పటికి జ్వరం తగ్గలేదు. కొంచెం చదువు కున్నందున ఇటువంటప్పుడు పూజలు, పునస్కారాలు, మంత్ర తంత్రాల వలన కాక మందులకే తగ్గుతుందన్న నమ్మకంతో, ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళదాం అని అనుకున్నది. అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. పొరిగింటి నుండి కొంచెం బియ్యం అప్పుతెచ్చి నిన్న ఎలాగోలాగ వంటచేసింది. భర్త ఇంటికి వచ్చి ఐదురోజులు అయింది.

 జ్వరంతో ఉన్న చిన్న పిల్లని తన పెద్దకూతురికి అప్పజెప్పి, సుమతి ఇంటి నుండి బయలుదేరింది. దారిలో ఏమిచేయాలి అని పరిపరి విధాలుగా ఆలోచించింది. ముందుగా సారాయి అమ్ముదాం అనుకున్నది. వెంటనే అమ్మో! ఇంకేమైనా ఉన్నదా, మొన్ననే సారా అమ్ముతున్న లోకోయి వాళ్ళ అమ్మని, మద్యపాన నిషేదం వాళ్ళు పట్టుకుని గుండు గీయించి ఊరేగించారు.

  అనుకోకుండా, అంతలోనే ఒకరోజు మెడ్ లెంబి మాట్లాడుతూ – సినిమా టిక్కెట్లను బ్లాకులో అమ్మితే చాలా లాభాలు వస్తాయి. అని చెప్పడం గుర్తుకు వచ్చింది.

  జ్వరంతో బాధపడుతున్న కూతురి చికిత్స కోసం తన సిగ్గు, బిడియాన్ని వదిలి టిక్కెట్లు బ్లాకులో అమ్మడం ప్రారంభించింది. మొదట్లో కొంచెం తప్పుగా అనిపించేది. ఒకరోజు తన స్నేహితురాలు బినాసఖీ తన భర్తతో కలిసి కారులో సినిమాకు వచ్చింది. ఆమెకు కనిపించకుండా తప్పించుకోవడానికి నానా అగచాట్లు పడవలిసి వచ్చింది. దీని వలన ఆమె వద్ద మూడు టిక్కెట్లు అమ్ముడుపోలేదు. కొన్నిరోజులకు పూర్తిగా సిగ్గు, భయం అన్ని పటాపంచలైపోయినాయి. బ్లాకు టిక్కెట్లు అమ్మో వాళ్ళను పట్టుకునే పోలిసులు కూడా ఆమెకు బాగా పరిచయిస్తులు అయిపోయారు. ఆవిధంగా ఆమె ఈ పనిని తన వృత్తిగా మార్చుకుంది. కొన్నిరోజులు బాగానే గడిచాయి. అయితే మరల ఆమెను దురదృష్టం వెంటాడింది. ఒక స్ట్రిక్ట్ పోలిసు అధికారి ఇంఫాల్ కు రావడం జరిగింది. ఆమె దురదృష్టవశాత్తు మఫ్టీలో వచ్చిన ఆ పోలిసు అధికారికే టిక్కెట్ అమ్మి పట్టుబడిపోయింది. ఆమెను పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. పోలిసు చట్టం 1862, మణిపూర్ సవరణ చట్టం 1976, సెక్షన్ 34 రూపంలో మరలా అమె కష్టాలు ప్రారంభం అయ్యాయి.

 కొంతకాలం తర్వాత జైలు నుండి విడుదల అయి బయటికి వచ్చింది. ఇప్పుడు ఆమె అస్ధవ్యస్ధమైన ఇంటిని చూసి మరలా బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు అమ్మకుండా ఉండగలదా?            

Popular posts from this blog

संशय की एक रात और युगीन संदर्भ

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”