Hindi Sahitya Charitra - 1 // హిందీ సాహిత్య చరిత్ర – 1


హిందీ సాహిత్య చరిత్ర – 1

హిందీ మూలం :  డా. ఋషభ్ దేవ్ శర్మ

తెలుగు అనువాదం :  డా. యస్.వి.యస్. యస్. నారాయణ రాజు

हिंदी मूल :  डॉ. ऋषभ देव शर्मा

                   तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू

स्रवंति / స్రవంతి

अगस्त 2003   / అగష్టు 2003

       ( హిందీ సాహిత్య విశేషాలను తెలుగు పాఠకులకు, తెలుగు సాహిత్య రీతులు మరియు తీరుతెన్నులను గురించి హిందీ పాఠకులకు అందించి తద్వారా జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే స్రవంతి ద్విభాషా మాసపత్రిక యొక్క లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో ఒక భాగంగా  హిందీ సాహిత్య చరిత్రను తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ శీర్షకను ప్రారంభించడం జరిగింది. హిందీలో ఉచ్ఛ శిక్ష ఔర్ శోధ్ సంస్ధాన్, హైదరాబాద్ శాఖ రీడర్ డా. ఋషభ్ దేవ్ శర్మ గారు వ్రాసిన హిందీ సాహిత్య కీ రూప్ రేఖా ను తెలుగులో హిందీ సాహిత్య చరిత్ర పేరిట డా. యస్.వి.యస్.యస్. నారాయణ రాజు గారు అనువాదం చేశారు. ఇకపై ప్రతి నెలా హిందీ సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి సంపూర్ణ హిందీ సాహిత్య చరిత్రను గూర్చి తెలుసుకునేందుకు వీలుగా క్రమంగా ప్రచురించడం జరుగుతుంది.                                                                                                                                              సంపాదకులు)

 హిందీ సాహిత్యం - ప్రారంభదశ :

                   హిందీ సాహిత్యం, హిందీ భాష ఆవిర్భావం క్రీ.శ. 1000 నుండి ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. కానీ ఈ విషయంలో విద్వాంసులందరిలో ఏకాభిప్రాయం లేదు. భాషావైజ్ఞానికుల అభిప్రాయం ప్రకారం సంస్కృత భాషా పరంపరలో పాళీ, ప్రాకృత్ భాషల తరువాత క్రీ.శ. 500 నుంచి 1000 వరకు గల కాలం అపభ్రంశ భాష కాలము. అపభ్రంశము అనేక సాహిత్య మరియు సాధారణ వాడుకలో నున్నటువంటి విభిన్న రూపాలు ఉన్నాయి. వీటి నుండి అనేక ఆధునిక ఆర్య భాషలు క్రీ.శ. 1000 నాటికి జన్మించాయి. హిందీ అనగా ఉపభాషల (పశ్చిమహిందీ, పూర్వీహిందీ, రాజస్ధానీ, పహాడీ మరియు బిహీరీ) సమ్మిళతమైన భాషా ప్రాంతాలకు సంబంధించినటువంటి భాష. దీనిలో 17 విభిన్న బోలీలు మాండలీకాలు ఉన్నాయి. సామాజిక, సాహిత్య ప్రయోగంలోనున్న ఉర్దూను కూడా యిందులో ఒక భాషగా కలపాలి మరియు దఖ్కినీ పేరుతో నున్నటువంటి మరియొక భాష రూపం హిందీ భాష కోష్ యొక్క వ్యావహారిక కోడ్ రూపము కాని ఉర్దూ మరియు దఖ్కిని భాషల యొక్క సాహిత్య చరిత్రను వేరుగా అధ్యయనం చేయడం జరిగింది.

    హిందీ భాషా ఉద్భవానికి సంబంధించి అనేక విధ్వాంసుల యొక్క అభిప్రాయమేమిటంటే క్రీ.శ. 1000కి పూర్వమే హిందీ భాష జన్మించింది. యిందువలననే పండిత్ చంద్రధర్ శర్మా గులేరి అపభ్రంశం యొక్క ఉత్తరార్ధభాగాన్ని పురానీ హిందీ అని మరియు దాని యొక్క సాహిత్యాన్ని హిందీ యొక్క ప్రారంభ సాహిత్యమని పేర్కొన్నారు. ఐతే పూర్వ సంస్కృత సాహిత్యాన్ను పురానీ హిందీ గా గుర్తించి హిందీ సాహిత్యంలో అంతర్భాగం చేయవచ్చునా అనే ప్రశ్న వేసినట్లయితే దానికి సమాధానము సుస్పష్టముగా కాదు అని వస్తుంది.

  ఇదే విధంగా ఆచార్య రామచంద్ర శుక్ల, శివసింగ్ సెహంగార్ మరియు మిశ్ర బంధు కూడా చరిత్ర గ్రంధాలలో అపభ్రంశ కాలంలో ఉన్నటువంటి హిందీ సాహిత్యాన్ని స్వీకరించలేదు. వాస్తవంగా ఉత్తరార్ధ అపభ్రంశము లేదా అవహట్ యొక్క సాహిత్యం అపభ్రంశముదే కాని హిందీది కాదు.

 డా. ధీరేంద్రవర్మ మరియు డా. రామ్ కుమార్ వర్మలు 10 వ శతాబ్ధం నుండి హిందీ సాహిత్యం ప్రారంభమైనదని భావించుచున్నారు. కాని వాస్తవమేమిటంటే ఈ కాలంలో హిందీ సాహిత్యానికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక గ్రంధము లభించలేదు. 

 డా. సునీత్ కుమార్ చాటుర్జ్యా, డా. ఉదయ్ నారాయణ్ తివారి మరియు డా. నామవర్ సింగ్ మొదలైనటువంటి విద్వాంసుల అబిప్రాయమేమిటంటే హిందీ సాహిత్యం 13 శతాబ్దంలో మొదలైనది. కాని ఈ అభిప్రాయము కూడా స్వీకరించదగినది కాదు. ఎందుకంటే నవీన పరిశోధన ద్వారా తెలిసిన విషమేమిటంటే 12 వ శతాబ్దంలో లభించిన అనేక సాహిత్య కృతులలో హిందీ మరియు అపభ్రంశల యొక్క సంక్రాంతి కాలం యొక్క లక్షణాలన్నీ సురిక్షితంగా ఉన్నాయి. అపభ్రంశం నుండి హిందీకి మారిన సమయంలోని ముఖ్య లక్షణాలలో తత్సమ లక్షణాలు ముఖ్యమైనవి. ప్రారంభ కాలంలోని హిందీ వ్యాకరణం అపభ్రంశం నుండి వేరుపడి సమాన లక్షణాలను విడిచి అనేక విభిన్న రూపాలను గ్రహించడం జరిగింది.

 హిందీ ప్రధమ కవి :  

హిందీ సాహిత్యంలో ప్రధమ కవిగా చెప్పుకునే అనేక పేర్లలో అన్నింటికన్నా ముందుగా ఒక అజ్ఞాన కవి  పుష్య ( పుండ్) ఇతడు సుమారుగా 7,8 శతాబ్దాలకు చెందినవాడుగా భావిస్తున్నారు. కాని ఇతనికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథమేదీ లభించలేదు. బహుశ పుష్య లేదా పుండ్  అపభ్రంశ కవి పుష్యంతుడు అనే పేరు అయి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయము.

    ఆచార్య రామచంద్ర శుక్ల యొక్క చరిత్రలోని అపభ్రంశానికి సంబంధించిన భాగాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆచార్య దేవసేనుడు ప్రధమ కవిగా తెలుస్తుంది. కాని అతడు అపభ్రంశ కవియే గాని హిందీ కవి కాదు. వీరగాథా కాలం నాటి ప్రథమ రచనగా సుమారుగా1123లో రచించినటువండి ఖుమాన్ రాసో ను ప్రథమ రచనగాను దాని గ్రంథకర్త దళపతివిజయ్ ప్రథమ కవిగా తెలుస్తుంది. కాని యిది కూడా స్వీకరించదగినది కాదు ఎందుకంటే తర్వాత కాలంలో చరిత్రకారుల వాస్తవంగా ఖుమాన్ రాసో 18వ శతాబ్దం నాటి రచన అని నిర్ధారించారు.

 డా. రామ్ కుమార్ వర్మ మరియు డా. రామ్ గోపాల్ శర్మ దినేష్ లు హిందీ సాహిత్య ప్రారంభం 8వ శతాబ్దపు సిద్ద కవి సరహప (క్రీ.శ. 769) అని భావిస్తున్నారు, మరియు రాహుల్ సాంకృత్యాయన్ సంపాదకత్వంలో వచ్చిన దోహకోష్ లోని ఉదాహరణల ద్వారా సరహప రచనలలోని అపభ్రంశ వ్యాకరణానికి బదులుగా తత్సమ లక్షణాలను చూపించడం జరిగింది మరియు ఈ పరంపర యొక్క వికాసములు చౌరాసి సిద్దు రచనలలో కన్పిస్తుంది. కాని డా. గణపతి చంద్రగుప్త్ అభిప్రాయం ప్రకారం సరహప యొక్క మూల రచనలు లభించటంలేదు. దోహ కోష్ లో ఉన్నవి టిబెట్ లో లభించినటువంటి టిబెట్ అనువాదం  నుండి రాహూల్ సాంకృత్యాయన్ చేసిన అనువాదం మాత్రమే అందువల్ల సరహప హిందీ ప్రధమ కవి కాదు.

డా. హజారీప్రసాద్ ద్వివేది పృద్వీరాజ్ చౌహాన్ యొక్క సమకాలీకుడు చంద్ బరదాయి ని హిందీ భాష యొక్క ప్రథమకవిగా గుర్తిస్తూ చందబరదాయి అపభ్రంశ సాహిత్యపు అంతిమకవిగా మరియు హిందీ భాషకు ఆదికవిగానూ గుర్తించడం జరిగింది. చందబరదాయి రచించనటువంటి పృథ్వీరాజ్ రాసో (క్రీ.శ 1200) ను ప్రథమ మహాకావ్యంగా గుర్తించడం జరిగింది.

 డా. గణపతి చంద్రగుప్త్, శాలిభద్రసూరి కవి రచించినటువంటి భరతేశ్వర్ బహూబలిరాశ్ (క్రీ.శ. 1184) హిందీ సాహిత్యం యొక్క ప్రథమ రచనగా గుర్తించడం జరిగింది ఇది పృథ్వీరాజ్ రాసో కన్నా పూర్వపు రచన. ఈ కృతి యొక్క మూలము పూర్తిగా లభ్యం అవలేదు మరియు ఇది గుజరాతీ, రాజస్థానీ మరియు హిందీలలో గుర్తించడం జరిగింది. ఇది హిందీ జైన సాహిత్యంలోని రాస్ పరంపరలోని ప్రథమ కావ్యంగా గుర్తించటం జరిగింది. యిందులో హిందీ భాష యొక్క ప్రారంభికదశ లోని భాషాలక్షణాలు కన్పిస్తాయి.  దీని ఆధారంగా శాలి భద్రసూరిని ప్రధమ హిందీ సాహిత్య కారుడుగాను, అతను ద్వారా క్రీ.శ. 1184 రచించబడిన భరతేశ్వర్ భాహుబలిరాస్ ను హిందీ ప్రథమ కావ్యంగాను చెప్పవచ్చును. అయినప్పటికీ హిందీ యొక్క ప్రథమ మహాకవియొక్క గౌరవం చంద్ బరదాయికి దక్కింది మరియు ఆయన క్రీ.శ. 12 వ శతాబ్దంలో రచించినటువంటి పృథ్వీరాజ్ రాసో ప్రథమమహాకావ్యంగా గుర్తింపు పొందింది.

 క్రీ.శ. 1184 కు ముందు ఉన్నటువంటి విభిన్న కావ్య ప్రవృత్తులు                       (అపభ్రంశసాహిత్యము మరియు సిధ్ద సాహిత్యము)  హిందీ సాహిత్య చరిత్రలో ఆది కాలము యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి సహాయబడ్డాయి.

హిందీ సాహిత్య కాల విభజన :- సమయ నిర్దారణ మరియు నామకరణ సమస్యలు

హిందీ సాహిత్య చరిత్ర యొక్క వివిధ కాలాలు

 ప్రారంభ సమయము

అంతిమ సమయము

(1) ఆది కాలము

(2) భక్తి కాలము (పూర్వ మద్య కాలము)

(3) రీతి కాలము (ఉత్తర మధ్యకాలము)

(4) ఆధునిక కాలము

 (అ)భారతేందుయుగము (పునర్జాగరణయుగము)

(ఆ) ద్వివేది యుగము

  (జాగరణ సుధార్ యుగము)

(ఇ) ఛాయావాద్ యుగము

(ఈ) ఛాయాదాదోత్తరయుగము

(ఉ) ప్రగతి ప్రయోగ యుగము

(ఊ) నవలేఖన యుగము

క్రీ.శ 769/ క్రీ.శ.1184

క్రీ.శ. 1350

 

 

క్రీ.శ. 1650

క్రీ.శ. 1850

క్రీ.శ. 1857

 

 

క్రీ.శ. 1900

 

 

క్రీ.శ. 1918

క్రీ.శ. 1938

క్రీ.శ. 1938

 

క్రీ.శ. 1957

క్రీ.శ. 1350

క్రీ.శ. 1650

 

 

క్రీ.శ. 1850

 

 

క్రీ.శ. 1900

 

 

క్రీ.శ. 1918

 

 

క్రీ.శ. 1938

 

క్రీ.శ. 1957

   

 ఆదికాలము యొక్క నామకరణము :-

   హిందీ సాహిత్యంలో ప్రథమ భాగానికి  వివిథ విద్వాంసులు వేరు వేరు పేరులు పెట్టారు. జార్జి గ్రియరసన్ చారణ్ కాల్ అని, మిశ్రబంధు ఆరంభిక్ కాల్ అని, రామచంద్రశుక్ల్ ఆదికాల్ అంటూనే, వీరగాథాకాల్ అని, డా. రామ్ కుమార్ వర్మ సంధికాల్ మరియు చా                                                                                                                                    రణ్ కాల్ అని. రాహుల్ సాంకృత్యాయన్ సిద్ధసామంత్ కాల్ అని, విశ్వనాధ్ ప్రసాద్ మిశ్ర వీర్ కాల్, డా. వాసుదేవ్ సింగ్ ఉద్భవ్ కాల్ అని, డా. రామ్ కిలావన్ పాండే సంక్రమణ్ కాల్ అని, డా. గణపతి చంద్రగుప్త ప్రారంభిక్ కాల్ అని మరియు డా. రమాశంకర్ శుక్ల రసాల్ బాల్యవస్ధా మరియు జయ్ కావ్య్  అని నుడివిడినారు. ఇందులో ఆచార్య రామచంద్రశుక్ల ఆదికాల్ అని పేరు పెట్టినప్పటికి దానికి అంతగా ప్రాధాన్యత నివ్వలేదు. అయినప్పటికి ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది తన చరిత్ర గ్రంథాలలో ఆదికాల్ గానే గుర్తించారు. అనేక పేర్లు సూచించనప్పటికి అవన్ని కూడా ఆదికాలానికి సంబంధించిన విభిన్న లక్షణాలను వ్యక్తం చేయడంలో విఫలమైన కారణంగాను మరియు కేవలము ఒకటి లేదా రెండు లక్షణాల వరికే పరిమితం కావడం చేత మరియు విస్తృతంగా వ్యవహారికంలో రాకపోవటం వలన యిప్పుడు ఇంచుమించుగా అవన్ని వెనుకబడిపోయినవి. ప్రస్తుతము ఆదికాల్ పేరుతోనే ప్రయోగంలో ఉన్నది.

 భక్తికాలము యొక్క నామకరణము :

 14వ శతాబ్దపు మధ్యకాలము నుండి 19వ శతాబ్దపు మధ్య భాగం వరకు గల 500 సంవత్సరాల విశాల కాలావధిలోని హిందీ సాహిత్య చరిత్రను మధ్యకాలము అనే పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ కాలములోని చైతన్యమంతా మధ్యకాలీన చైతన్యము. మధ్యకాలీన చైతన్యమనగా సంపూర్ణ సమాజం కాకుండా సమాజంలోని కొన్ని సంస్థల కేంద్రీయ మహాత్యమున గురించి మరియు వాటి ఆలోచన పరంపర. ఇవి ధార్మిక మరియు రాజనీతి సంస్థలు. ఇందులో ధార్మిక సంస్థలు భక్తి ఆందోళన రూపంలో 17వ శతాబ్ధము మధ్యభాగం వరకు విశేష ఖ్యాతి నార్జించినవి. యిందువలన క్రీ.శ. 1350 నుండి క్రీ.శ. 1650 వరకు గల కాలమును పూర్వ మధ్యకాలము లేదా భక్తికాలము అనడం ఎంతైనా సముచితము. ఆచార్య పరుశురామ్ చతుర్వేది గారి అభిప్రాయం ప్రకారము – హిందీ సాహిత్య చరిత్రలో భక్తికాలము అనగా ముఖ్యంగా భాగవత సూత్రముల ప్రచార ఫలితము భక్తి ఆందోళనమునకు మార్గదర్శకమయినది మరియు దాని యొక్క అత్యంత లోకోత్తరమైన ప్రవృత్తి కారణంగా నెమ్మది నెమ్మదిగా జన ప్రచలితమైన భాషలు భక్తి భావాన్ని వ్వక్త పరచడానికి మాధ్యమంగా మారిపోయాయి మరియు కాలంతరములో భక్తికి సంబంధించిన విస్తృత సాహిత్యం వరద వలె పొంగి పొర్లింది. ఈ కాలంలో భక్తితో పాటు మిగతా సాహిత్య రచన జరిగినప్పటికి అవి నామమాత్రమే. యిందువలన పూర్వమధ్యకాలాన్ని భక్తికాల్ అనడం అత్యంత సముచితము.

 రీతి కాలము యొక్క నామకరణము :

 ధర్మ సంబంధమైన చైతన్యమే కాక మధ్యకాలం యొక్క రెండవ లక్ష్యము రాజనీతి వ్యవస్థ. దీని కారణంగానే ఉత్తర మధ్యకాలంలో రాజ్యశ్రయంలో సామంత వాదీ ఆలోచన ప్రధానమైన సాహిత్యరచన జరిగింది. యిది మధ్యకాలీన చైతన్యం యొక్క ఉత్తరార్ధ భాగము. ఉత్తర మద్యకాలమునకు అలంకార్ కాలము అని శృంగార కాలము మరియు రీతికాలము అని పేర్లున్నాయి. మిశ్రబంధువులు దీనిని అలంకృత్ కాలము అని అన్నారు ఈ సందర్భంగా గమనించవలసినదేమిటంటే –

1. ఈ కాలంలోని కవిత్వము అలంకృతమే కాకుండా మిగతా కావ్యాంగాలను కూడా స్వీకరించింది.

2. ఇందులో అలంకారాలే కాదు రస సిద్ధాంత నిరూపణ మరియు సర్వాంగ నిరూపణతో కూడినటువంటి రచనలు ఈ కాలంలో ఎక్కువ సంఖ్యలో రచించబడ్డాయి.

3. ఈ కాలంలో శృంగార భావనమే రచనలకు మూలము అయినప్పటికి వీర రస, భక్తి మరియు నీతికి సంబంధించిన కావ్వాలు కూడా రచించబడ్డాయి. యిందువలన ఈ కాలానికి అలంకృతకాలము అని అలంకార్ కాలము శృంగార కాలము అనడము సముచితమం కాదు. రెండవవైపు రీతి నిరూపణ, రీతి నిర్వాహణ మరియు రీతులను ఉల్లంఘించి అనే మూడు లక్షణాలను కేంద్ర బిందువులుగా చేసుకుని రీతి (కావ్యపరంపర), రీతి ఉన్న కారణంగా ఈ కాలాన్ని రీతికాలము అనడము తర్కసంగతము.

 ఆధునిక కాలము యొక్క నామకరణము :

19వ శతాబ్దములోని మధ్యభాగములో భారతదేశంలో పారిశ్రామికీకరణ, నవీన విధ్య, వైజ్ఞానిక విప్లవము కారణంగా ఆధునికత ఆవిర్భవించింది. దీని పరిణామ స్వరూపంగా మధ్యకాలంలోని రెండు ముఖ్యతత్వాలయిన అలౌకికభావన మరియు సామంత వాది ఆలోచలపై తీవ్ర ప్రభావం పడినది, మరియు ఆధునికత ప్రారంభమయినది. ఆధునికతాబోధ్ యొక్క రాకతో మధ్యకాలీన అభివృద్ధి నిరోదక, జడత్వము, మరియు మూఢ విశ్వాసాలు ఖండించబడి రీతివాదము యొక్క పరంపర వెనుకబడి లౌకిక దృక్పథము అభివృద్ధి చెందినది. వ్యక్తిలో సమాజముపట్ల బాధ్యత ఉదయించినది. పత్రికారంగము మరియు గద్య వికాసము జరగినది. సుధారవాది మరియు సంస్కృతి యొక్క పునరధ్యాయన కేంద్రంగా వ్యక్తి యొక్క ఆలోచనకు ప్రాధాన్యత పెరిగినది. ధార్మిక సంబంధమయిన, రాజ్య సంబంధ రచనలు కాకుండా సమాజము కేంద్ర బిందువుగా రచనలు వెలువడ సాగినవి, మరియు వ్యక్తి కేంద్ర బిందువుగా మారాడు. ఈ సంపూర్ణ సామాజిక మరియు ఆలోచనాపరమైన మార్పులను క్రీ.శ. 1850 తర్వాత వచ్చిన సాహిత్యం స్వీకరించటమే కాకుండా వ్యక్తపరిచినది మరియు దిశానిర్దేశం చేసినది. యిందువలన ఆధునికతా బోధ్ తో కూడిన సంపూర్ణ వర్తమాన కాలపు ఈ సాహిత్యానికి ఆధునిక కాలము అనడం ఎంతైనా సముచితము.

 (కాని యిప్పటికి ఆ ఆధునిక కాలము 150 సంవత్సరములు అయిపోయినది. యిందులో తీవ్ర వేగంతో వచ్చిన మార్పులననుసరించి యిందులోని విభిన్న కాల భాగాలకు వేరువేరు పేర్లను పెట్టవచ్చును.) 

 

                             

 


Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी