శ్రీ మోటూరి సత్యనారాయణ గారు श्री मोटूरि सत्यनारायणजी






                             శ్రీ మోటూరి సత్యనారాయణ గారు  

హిందీ మూలం :  ప్రొ. నా. నాగప్ప
 తెలుగుఅనువాదం :  ప్రొ .యస్.వి.యస్.యస్. నారాయణ రాజు
हिंदी मूल   प्रो. ना. नागप्पा
तेलुगु अनुवाद   प्रो. एस.वी.एस.एस. नारायण राजू

स्रवंति,  सितंबर 2002 - अप्रैल 2003
पद्मभूषण डॉ. मोटूरी सत्यनारायण जन्मशती विशेषांक

      శ్రీ సత్యనారాయణ గారు ఒక వ్యక్తి కాదు ఇంకా చెప్పాలంటే ఆయన ఒక నడిచే కేంద్రం మరియు విజ్ఞాన సర్వస్వం. 1935 లో నేను ప్రచారక్ గా ఉన్నప్పుడు ఆయన సంఘటన్ మంత్రి. అప్పడు హిందీ ప్రచార ప్రెస్ త్రిప్లికేన్ లోను మరియు కార్యాలయం జార్జి టౌన్ లోను ఉండేది. కొంతకాలం తరువాత కార్పోరేషన్ నుండి మూడున్నర ఎకరాల భూమిని మాంబలంలో కొన్నారు. అప్పటి కమీషనర్ హమిద్ ఖాన్ సాహేబ్ గారు అప్పట్లో సభా ఉపాద్యక్షులుగా శ్రీ రాజ గోపాలచారిగారు మరియు న్యాయసలహా దారుగా శ్రీ భాష్యం అయ్యంగారు ఉండేవారు.  శ్రీ హమిద్ ఖాన్ గారు సభా భవనానికి పునాదిరాయి వేశారు. భవన నిర్మాణమయిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ చేతులమిదగా భవన ప్రారంభోత్సవం జరిగింది. భవనంలో ఒక విశాలమైన హాలు (శ్రీ భాష్యం అయ్యంగార్ పేరు మిదుగా) మరియు దానిచుట్టూ అనేక గదులు నిర్మించడం జరిగింది. వాటిలో మరియు హాలులో పరీక్ష విభాగము, సాహిత్యవిభాగము మరియు ప్రచార విభాగము పనిచేస్తుండేవి. శ్రీ పి.వి. సుబ్బరామన్ పరీక్ష మంత్రిగా ఉండేవారు. ఆ రోజుల్లో యస్.ఆర్. శాస్త్రి, శ్రీ అవధనందన్(బీహార్),  శ్రీ రఘువర్ దయాళ్ మిశ్ర(ఉత్తరప్రదేశ్) ముఖ్యకార్యకర్తలు. 1937 లో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో సభ పరిస్థితి మారిపోయింది. ఆర్ధికంగా పుంజుకొన్నది.

    1934-35 లో సభ శాశ్వత అధ్యక్షులు మహాత్మా గాంధిగారి  ఆదేశానుసారం శ్రీ కాకా సాహెబ్ కాలేల్ కర్ గారు దక్షిణభారతం పర్యటన చేసి దాని రిపోర్టును పూజ్యగాంధీజీ గారికి సమర్పించారు. దాని ఫలితంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ప్రాంతీయ శాఖలు మరియు కేంద్రంలో శిక్షాపరిషత్ ను ప్రారింభించడం జరిగినది. మద్రాసు నుండి మైసూరు, మైసూరు నుండి బెంగుళూరు, బెంగుళూరు నుండి ధార్వాడ్ కు ప్రాంతీయసభ మారిన తర్వాత ధార్వాడ్ లోని శ్రీ సిధ్ధేంద్రనాథ్ పంత్ ప్రాంతీయ మంత్రిగా ఉండగా, ప్రాంతీయ హిందీ శిక్షక్ విద్యాలయానికి మెదటి ఆచార్యునిగా వెళ్ళాను. ఆ తరువాత 1.7.1938 నుండి 29.4.72 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో హిందీ విభాగాధ్యక్షునిగా మరియు ప్రొఫెసర్ గా సేవలందించాను.

   మద్రాసు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చక్రవర్తుల రాజగోపాలచారిగారు. ఆయన తమిళనాడు పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా బోధనాంశంగా చేశారు. సభ క్రొత్త ప్రచారక విద్యాలయాలను తెరిచింది. అనంతపూర్, విజయవాడ, మద్రాస్, ఎర్నాకుళం, సేలం, త్రిచ్చి మరియు కోయంబత్తూర్ లో హిందీ ప్రచారక్ విద్యాలయాలను ప్రారంభించడం జరిగినది. ఇందులో శిక్షణ పొందినవారు మద్రాసు పాఠశాలల్లో అధ్యాపకులుగా చేరారు. ఈ విద్యాలయాలన్నిటినీ శ్రీ సత్యనారాయణగారే నిర్వహించేవారు.

     ప్రాంతీయ సభలు ఏర్పాటు తర్వాత సత్యనారాయణ గారి కార్యక్షేత్రం పెరిగింది. సువిశాలమయిన దక్షిణ భారతదేశంలో నాలుగు శాఖలను అత్యంత సమర్థవంతంగా నడిపించారు.  అప్పట్లో సభ ప్రధానమంత్రి హరిహరశర్మ గారిని అందరూ సభ పెద్దగా గౌరవించేవారు. కాని పనిదృష్ట్యా సత్యనారాయణ గార్కి సభలోని ప్రతికార్యకర్తతోనూ పరిచయం ఉండేది. అయినా ప్రధానమంత్రిగారి కంటే ఎక్కువగా అందరితో కలిసి ఉండేవారు. అందువలన మేము అన్ని విషయాలు శ్రీ మెటూరి సత్యనారాయణ గారికే విన్నవించుకొనేవారము.

   1936 లో హిందీసాహిత్య సమ్మేళనం యొక్క వార్షిక సమ్మేళనం మద్రాసు లో జరిగింది. ఆ సమయంలో శ్రీ హరిహరశర్మగారు తన పదవికి రాజీనామా చేశారు. శ్రీ సత్యనారాయణ గారిని వార్దా పిలవడం జరిగింది. మహాత్మగాంధీగారి అధ్యక్షతన రాష్ట్రభాషా ప్రచారసమితిని ఆయన ప్రారంభించారు. ఆసంస్థ తరువాత కాలంలో ఉత్తర భారతదేశంలో హిందీయేతర ప్రాంతంలో(కాశ్మీర్, అస్సాం, బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్ మరియి సింధ్ ప్రాంతాలు) హిందీ ప్రచారం చేసే అత్యున్నత సంస్థగా పరిణితి చెందింది. ఆ సంస్థ అభివృధ్ధికి శ్రీ సత్యనారాయణ గారి మార్గనిర్ధేశకత్వమే కారణమని జగద్విదితము.

   తరువాత సత్యనారాయణ దక్షిణభారతదేశానికి వచ్చారు. అప్పటినుంచి అరవై సంవత్సరములు నిండేవరకు సభ యొక్క ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన తన ప్రతిభాపాటవాలతో సభను నలుదిశలా వ్యాపింపచేశారు.

  సత్యనారాయణగారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో ఉన్న దొండపాడు అనే గ్రామంలో 2.2.1902 నాడు జన్మించాడు. వారి మేనకోడలు సుభద్ర శ్రీ బోయపాటి నాగేశ్వరరావుగారి ధర్మపత్ని ఈ దంపతులు ఇద్దరు అరవై సంవత్సరాల నుండి హిందీ ప్రచార ఉద్యమంలోనే ఉన్నారు. వారి జీవితాన్ని హిందీ సేవకే అంకితం చేశారు. ఈయన వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికి దేశభక్తి మరియు విభిన్న కార్యక్రమాలను నిర్వహించేశక్తి అత్యంత అద్భుతమైనది. ఆయనకు పూజ్య మహాత్మా గాంధి, శ్రీ జమునాలల్ బజాజ్, డా. బాబురాజేంద్ర ప్రసాద్ మొదలైన ప్రముఖ దేశభక్తుల ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండేది. ఆయనకు ప్రతి పనిలోనూ విజయమే లభించింది.

  శ్రీ సత్యనారాయణగారి దూరదృష్టి ఫలితమే ప్రస్తుత సమయములోనున్న దక్షిణ భారత హిందీ ప్రచార సభ యొక్క ప్రగతి. ఆయన ప్రెస్, ప్రచారం, పుస్తక-ముద్రణ మరియు అన్ని శాఖలను నిర్వహించడంలో ఆయనకు ఆయనేసాటి. సభ కార్యకర్తలకు సత్యనారాయణ గారంటే పంచప్రాణాలు. నన్ను అనేకసార్లు ఆయన సినిమాకు తీసుకువెళ్ళారు. సినిమాలను చూస్తూ, చూపిస్తూ, నాలాంటి కార్యకర్తలతో మైత్రిని పెంపొందించు కొనేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సత్యనారాయణగారు సెన్సార్ బోర్డు సభ్యులుగా పనిచేశారు.

   1946 లో సత్యనారాయణగారి ఆధ్వర్యంలో సభ రజిత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ్య మహాత్మగాంధీ గారు వారం రోజులపాటు సభా ప్రాంగణం లోనే ఉన్నారు. ఇది ఒక అత్యంత చిరస్మరణీయమైన సంఘటన. ఈ సందర్భంగా అఖిలభారతీయ రచయితల సమావేశం జరిగింది. దీనికి గాంధీగారు అధ్యక్షత వహించారు. ఇందులో కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత శ్రీమాస్తి వెంకటేష్ అయ్యంగార్ గారు కూడ పాల్గొనడమేకాక స్వాగత మంత్రిగా కూడా వ్యవహరించారు. నా పూజ్య గురుదేవులు పండిత వెంకటాచల శర్మగారు దీనికి సంచాలకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గాంధీగారు ఇలా అన్నారు మీరు అత్యంత ప్రతిభాసంపన్నమైన సమున్నత రచయితలు, మీ రచనలు చదివిన పాఠకులకు స్వాతంత్ర్యం సంపాదించే శక్తి ఎందుకు రావటం లేదు?”  అని రచయితలకు సవాలు విసిరారు. వారం రోజులపాటు జరిగిన రజత జయంతి సభలో అనేక వేలమంది పాల్గొనటమేకాక హిందీ ప్రచార ఉద్యమానికి అవసరమైన ప్రేరణను పొందారు.

  1942 క్విట్ ఇండియా ఉద్యమంలో సత్యనారాయణ గారు జైలుకు వెళ్ళారు. స్వాతంత్ర్య సేనానిగా సభ కార్యకర్తలకు ఆదర్శప్రాయమైనారు. వారు హిందీ ప్రచారోద్యమాన్ని స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక భాగంగా భావించేవారు. దక్షిణభారతదేశంలోని హిందీ ప్రచారకులందరు ఇలాగే భావించేవారు. అనేకమంది ప్రచారకులు స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు జీవితాన్ని అనుభవించారు. ఎవరైన హిందీ ప్రచారకులు జైలుకు వెళ్ళినట్లైతే వారికి ఆసమయమును సభ శెలవుగా మంజూరు చేసేది. జైలు నుండి వచ్చిన తర్వాత యధావిధాగా విధులకు హాజరు అయ్యేవారు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారాన్ని స్వాతంత్ర్య ఉద్యమంలోని ఒక భాగంగా పరిగణించేవారు. ఇప్పటికి కూడా దక్షిణభారతదేశంలో దేశ సమగ్రత ఐక్యతకు మారుపేరుగా హిందీ ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవంగా ఇది ఒక భాషా ఉద్యమము. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి ఉద్యమం లేదు అని రజతోత్సవ సభలో మహాత్మగాంధీగారు ప్రవచించారు.

     శ్రీ సత్యనారాయణగారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారు. వారు ఆగ్రాలో అఖిల భారతీయ హిందీ పరిషత్ ను ప్రారంభించి, దక్షిణ భారతదేశంలోని హిందీ ప్రచారకులకు హిందీ భాషా ప్రదేశంలో  ఒక సంవత్సరం పాటు ఉండి హిందీ భాషా యొక్క ఉఛ్చారణ, శైలి, మాట్లాడే పద్ధతిని  నేర్చుకునే  అవకాశం కల్పించారు. ఆ సంస్థ తర్వాత కాలంలో కేంద్రీయ హిందీ సంస్థాన్ (భారతప్రభుత్వం) గా మార్పు చెందింది. ఈ రోజున ఆ సంస్థ ఒక ప్రత్యేకమైన ఉనికిని పొందింది.

   శ్రీ సత్యనారాయణగారి ప్రతిభతో దక్షిణ భారత హిందీ ప్రచార సభ సర్వతోముఖాభివృద్ధి చెందింది. ప్రచారాన్ని నిర్వహించడం. ఆర్థిక సుస్థిరత, అవసరమైన పుస్తకాల ముద్రణ, పత్రిక సంపాదకత్వం, సాహిత్య వృద్ధి ద్వారా సభ ఒక ప్రముఖ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది.

   స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా నియమింపబడ్డారు. రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులుగా నియమితులైనారు. హిందీని రాజభాషగా చేయటంలో ఆయన కృషి ప్రశంసనీయము. రాజ్యాంగములోని 351 ఆర్టికల్ యొక్క వాస్తవ స్వరూపాన్ని వివరించడంలో సత్యనారాయణగారి పాత్ర చాలా ఉంది.

      శ్రీ సత్యనారాయణగారు హిందీ యొక్క ప్రయెజన మూలక రూపాన్ని వివరిస్తూ దేశభాష, రాజభాష ఉద్యమానికి కొత్త అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించారు. కేంద్రీయ హిందీ సంస్థాన్ అధ్యక్షులుగా ఆయన చేసిన కార్యాలను స్వర్ణాక్షరాలతో లిఖించదగినవి. ఆయన ప్రయెజనమూలక హిందీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడిపారు. ఈ ఉద్యమానికి విజ్ఞానాధారిత రూపాన్ని ఇవ్వడానికి శ్రీ రవీంద్రనాథ్ శ్రీ వాత్సవ వంటి విద్వాంసులను పిలిపించి ఆగ్రాలో చర్చాగోష్టులు నిర్వహించారు. ప్రయోజన మూలక హిందీ ఉద్యమానికి ప్రాణప్రతిష్టచేసి శ్రీ మోటూరి సత్యనారాయణ గారు దేశభాషా-రాజభాషా ఉద్యమానికి నాయకులైనారు. దేశభాష హిందీ ప్రచార ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చారు. దీనిని యు.జి.సి కూడా గుర్తించింది. దానికి సంబంధించి సాహిత్య నిర్మాణానికి ప్రోత్సహాన్ని కూడా అందించింది. ప్రస్తుతం దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ప్రయోజన మూలక హిందీ డిప్లోమా కోర్సులను నిర్వహిస్తున్నారు.

    కేంద్రీయ  హిందీ సంస్థాన్, ఆగ్రా వారు బ్యాంకింగ్ రంగానికి అవసరమైన సాహిత్యాన్ని తయారు చేసి బ్యాంక్ అధికారులను ఆగ్రా పిలిచి బ్యాంకింగ్ కార్యకలాపాలను హిందీ ద్వారా నిర్వహించటానికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమము రాజభాషా ఉద్యమానికి పునాది వంటిది. ప్రస్తుతం అన్ని విధాలుగా ప్రయోజనమూలక హిందీ విస్తరింపబడుతున్నది. ఈ అభివృద్ధిలో సంస్థాన్ యొక్క పాత్ర చాలా ఉన్నది.

    దక్షిణ భారత హిందీ ప్రచార సభను ఒక ప్రత్యేక రాష్ట్రీయ హిందీ సంస్థాన్ గా ప్రత్యేకతను సంతరింపచేయటంలో సత్యనారాయణగారి పాత్ర అవిస్మరణీయమైనది. చిత్తూరుకు చెందిన వకీలు శ్రీనివాస అయ్యంగార్ గారి కృషి ఫలితంగా పార్లమెంట్ లో రాష్ట్రీయ మహత్వాకా సంస్థాన్ గా ప్రకటించబడినది. దీనితో ఈ రోజు సభ హిందీ విశ్వవిద్యాలయం లాగా మార్పుచెంది హిందీలో ఎమ్.., పి.హెచ్.డి., డి.లిట్. కోర్సులను నడుపుతున్నది.

   స్వాతంత్ర్యనంతరం భారత రాజ్యంగంలో హిందీ భాషను దేశభాష మరియు సంపర్క భాషగా స్వీకరించడం జరిగింది. అప్పటికే అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషగా హిందీ గుర్తింపు పొందింది. కాని అది ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందలేదు. రాజ్యంగంలో స్వీకరించిన తరువాత ముఖ్యంగా హిందీ ప్రాంతాల లోనూ మరియు హిందీయేతర ప్రాంతాలలోనూ  ఆధునిక హిందీ యెక్క ప్రచార ప్రసారము బాగా జరిగినది. కాని వాస్తవంగా అవసరమయిన ప్రయోజన మూలక్ (Functional) హిందీ యొక్క స్వరూపం యిప్పటికీ ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు.

  హిందీ యొక్క ఆవశ్యకతను గుర్తించి 1967 లో హిందీ వికాస్ సమితి(Registered) ని స్థాపించచటం జరిగినది.  సమితి యొక్క ముఖ్య ఉద్ధేశ్యమేమిటంటే హిందీ కేవలం కొన్ని ప్రాంతాలకు చెందిన భాష కాదు మరియు సమస్త భారతదేశానికి చెందినది అందువలన హిందీ ప్రచార బాధ్యత హిందీ మాట్లాడే ప్రాంతాలపైన ఎంత ఉందో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రాంతాలపై కూడా అంతే ఉంది ఈ కారణంగానే అత్యంత ఉత్సాహ పూరిత హిందీ సేవకులు హిందీ వికాస సమితి ని దక్షిణ భారతదేశంలోని విభిన్న భాషల సమాహార నగరంగా పేరుపొందిన చెన్నైలో స్థాపంచడం జరిగింది. ఈ సమితి ద్వారా విశ్వజ్ఞాన సంహితను ప్రచురించటం జరిగింది. దీనికి ప్రధాన సంపాదకులు శ్రీ మోటూరి సత్యనారాయణ గారు. 

  ఈ విశ్వజ్ఞాన సంహిత యొక్క ప్రథమ భాగము సమాజ విజ్ఞాన్ యొక్క అంశము. ఈ గ్రంథము హిందీ వికాస సమితి ద్వారా ప్రచురించటం జరిగింది. దీనితో శ్రీ మోటూరి సత్యనారాయణ గారి ప్రతిభ అవగతమవుతుంది. ఈ కార్యాన్ని హిందీ ప్రాంతము వారు కూడా చేయలేకపోయిరి. కాని దీన్ని సత్యనారాయణగారు చేసి చూపించారు. అయితే ఈ బృహత్తర యోజన యింకా పూర్తికాలేదు. యిది అత్యంత బాధాకరమయిన విషయం.

      శ్రీ సత్యనారాయణగారు కేవలం విద్యారంగానికి మాత్రమే సంబంధించిన వారు కాదు. విభిన్న రంగాలకు వారు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుని ఆయనను పద్మభూషణ్ బిరుదుతో సన్మానించడం జరిగింది. యింతేకాకుండా కర్ణాటక హిందీ ప్రచార సమితి తరుపున రాజభాషాభూషణ్ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ గౌరవ పురస్కారాన్ని యిచ్చినది.

  శ్రీ సత్యనారాయణగారు అఖిలభారతీయ ఖ్యాతినార్జించిన హిందీ ప్రచారనేతగా ఖ్యాతి పొందారు. వారని తలుచుకుంటేనే దక్షిణ భారతీయులందరూ పావనులవుతారు.     
    


Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी