సమకాలీన భారతీయ సాహిత్యంలో 'స్త్రీ' అధ్యయనం





సమకాలీన భారతీయ సాహిత్యంలో 'స్త్రీ' అధ్యయనం

Dr. S V S S Narayana Raju

స్రవంతి,

ద్విభాషా మాస పత్రిక, ఏప్రిల్ – 2004.

स्रवंति,

द्विभाषा मासिक पत्रिका, अप्रैल – 2004.




దక్షిణ భారత హిందీ ప్రచార సభ, విశ్వవిద్యాలయ విభాగము, ఉచ్చ శిక్షా ఔర్ శోధ్ సంస్థాన్లో నిర్వహించబడిన సమకాలీన భారతీయ సాహిత్యంలో స్త్రీ అధ్యయనం, సెమినార్ ను కేంద్రీయ హిందీ నిర్దేశాలయ్ డైరెక్టర్, శ్రీ పుష్పలతా తనేజా మరియు జ్ఞానపీఠ పురస్కార విజేత డా॥ సి. నారాయణరెడ్డి గారు ప్రారంభించారు. సెమినార్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన దా॥ సి. నారాయణరెడ్డి, తన ప్రారంభ ఉపన్యాసంలో ఇలా అన్నారు - "ఆధునిక మరియు వికసిత భారతదేశ నిర్మాణానికి వైజ్ఞానిక ప్రగతి మరియు సాంస్కృతిక వికాసం రెండు రెక్కల వంటివని చెప్పారు. సి.నా.రె. కంప్యూటర్ యుగంలో భారతీయ భాషలు సమాప్తమయిపోతాయనుకోవడం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటమే కాక విజ్ఞానము మరియు టెక్నికల్ ప్రగతితో పాటు మనము మన సాంస్కృతిక గుర్తింపును సురక్షితంగా ఉంచుకోవాలంటే హిందీ మరియు అన్ని భారతీయ భాషలు నిరంతర వికాసం చెందాలని అన్నారు. ఎందుకంటే భారతీయత యొక్క మూలాలు భారతీయ భాషల సాహిత్యంలోనూ మరియు ఈ మట్టి పొరలలోనూ ఉన్నది.


ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించిన డా॥ పుష్పలతా తనేజా మాట్లాడుతూ సమాజంలో సరియైన పరివర్తన తేవాలంటే స్త్రీలకు విద్య అత్యంత అవసరము. దక్షిణభారత హిందీ ప్రచార సభ మారుమూల పల్లె, పల్లెకు హిందీ భాషా ప్రచారాన్ని తీసుకువెళ్ళడమే కాకుండా స్త్రీలకు విద్యను అందిస్తూ సమాజాన్ని సంస్కరించే మహోన్నత కార్యాన్ని అత్యంత నిష్ఠతో చేస్తున్నదని కొనియాడారు. అంతేకాకుండా స్త్రీ తన శక్తి సామర్థ్యాలతో సమాజంలో తన ఉనికిని చాటి చెప్పాలని చెప్పారు. సమకాలీన భారతీయ భాషలు స్త్రీ అధ్యయనం అనే విషయం ఇప్పుడు చాలా ప్రాసంగికమని దాని ద్వారా విభిన్న సాహిత్యాల యొక్క ఆత్మను గుర్తించవచ్చని చెప్పారు.


సభ ప్రారంభంలో అధ్యక్షులు మరియు ముఖ్య అతిథులు పూజ్య బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. సరస్వతీ ప్రతిమ వద్ద దీప ప్రజ్వలన కావించారు. సంస్థాన్ విద్యార్థులు వందేమాతరంతో సభను ప్రారంభించారు. సంస్తాన్ రిజిస్ట్రార్ డా॥ పి.హెచ్. సేతుమాధవరావు స్వాగతోపన్యాసం ఇస్తూ ఇప్పటి పరిస్థితులలో స్త్రీ అధ్యయనం (Women's Study) ఎంతో ముఖ్యమన్నారు. ఋగ్వేదంలో కూడా 27 మంది మహిళా ఋషులను గురించి వివరణ ఉందని వారు అనేక వేలమంత్రాలను రచించారని కాని మధ్య కాలంలో స్త్రీని ఉపేక్షించడం జరిగినది. ఇందువలన ఇప్పుడు భారతదేశపు ఉజ్వల భవిష్యత్తుకు స్త్రీ అధ్యయనం అత్యంత అవసరమని చెప్పారు.


సెమినార్ డైరెక్టర్ డా|| ఋషభ్ దేవ్ శర్మ సెమినార్ కు ఈ విషయాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ స్త్రీ అధ్యయనం యొక్క ప్రాధాన్యతను చెప్పారు. స్త్రీ వాదము మరియు స్త్రీ విముక్తి వాదము, స్త్రీ అధ్యయనం (Women's Study) లో ఒక భాగమని వివరించారు. డా॥ || ఋషభ్ దేవ్ శర్మ సంపాదకత్వంలో వెలువడిన స్త్రీ సశక్తీకరణ్ (మహిళా సాధికారిత) పుస్తకాన్ని అతిథులుకు బహూకరించారు, సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రీయ హిందీ నిర్దేశాలయ్, అసిస్టెంట్ డైరెక్టర్, తన ఉపన్యాసంలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని మన సంస్కృతిలో భాగమైన అర్థనారీశ్వర్ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పారు. ఆంధ్ర సభ అధ్యక్షులు శ్రీ కాజ వెంకటేశ్వరరావుగారు మాట్లాడుతూ గాంధీగారి నేతృత్వంలో జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో స్త్రీలు తమ వంటిల్లు మరియు ఇండ్లనుండి బయటకు వచ్చి పురుషులతో సమానంగా పాలు పంచుకోనే అవకాశం లభించింది. ఇప్పటి పరిస్థితుల కనుగుణంగా స్త్రీ అధ్యయనం ఎంతో ప్రాసంగికమని కొనియాడారు. కేంద్రసభ ప్రథమ ఉపాధ్యక్షులు శ్రీ చేకూరి కాశయ్యగారు మాట్లాడుతూ సమాజ పరివర్తనకు స్త్రీ శక్తి ఎంతో అవసరమని స్త్రీ ప్రధాన సాహిత్యం యొక్క అవసరం ఎంతైనా ఉందని చెపుతూ ఈ రెండు రోజుల సెమినార్లోని మొత్తం వక్తల ప్రసంగాలన్నింటినీ ఒక పుస్తకరూపంలో భద్రపరచి భావితరాలకు అందించాలని చెప్పారు.

సభ కార్యదర్శి శ్రీ ధనంజయుడుగారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియచేస్తూ సెమినార్ మొత్తం విషయాన్ని ఒక పుస్తక రూపంగా ముద్రించి అందచేస్తానని చెప్పారు.

మధ్యాహ్నం సమకాలీన తెలుగు సాహిత్యంలో స్త్రీ అధ్యయనం అనే విషయం మీద చర్చ జరిగినది. దీనిలో ప్రొఫెసర్ ఐ.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, ప్రొ॥ లీలాజ్యోతి, ప్రొ॥ మాణిక్యాంబ లు పాల్గొన్నారు. దీనికి ప్రొ॥ వై. వెంకటరమణ రావుగారు అధ్యక్షత వహించారు. డా॥ యస్.వి.వి.యస్. నారాయణరాజు సంచాలకులుగా వ్యవహరించారు.

ఉచ్చ శిక్షా ఔర్ శోధ్ సంస్థాన్ రిజిస్ట్రార్ డా॥ పి.హెచ్. సేతుమాధవరావు అధ్యక్షత వహించిన సమకాలీన భారతీయ సాహిత్యంలో స్త్రీ అధ్యయనం విషయంపై చర్చ జరిగినది. దీనికి సంచాలకులుగా శ్రీమతి ఎన్. లక్ష్మీ అయ్యర్ వ్యవహరించారు. ఈ సభలో మలయాళ సాహిత్యంలో స్త్రీ పైన ప్రొ॥ టి.కె. నారాయణ పిళ్ళై, డా॥ కిషన్లాల్ గోన్వార్ కన్నడము, శ్రీమతి కవితావాచక్నవి తమిళ భాషలోని స్త్రీ అధ్యయనం గురించి ప్రసంగించారు. డా॥ రామ్ నివాస్ సాహు, భారతీయ సామెతలలో స్త్రీ గురించి వివరించారు.

రెండవరోజు ఉదయం జరిగిన హిందీ సాహిత్యంలో స్త్రీ అధ్యయనం విషయంపైన జరిగిన చర్చలో ప్రొ॥ దిలీప్ సింగ్, ప్రొ॥ నిర్మలా యస్. మౌర్య, డా॥ రవిరంజన్, డా॥ సచ్చిదానంద చతుర్వేది, డా॥ చర్ల అన్నపూర్ణ ప్రసంగించారు. ప్రొ॥ టి. మోహన్సింగ్ గారు హిందీ, తెలుగు సాహిత్యాలలోని స్త్రీ విషయం పై ప్రసంగించారు. ఈ సభకు ప్రొ॥ యం. వెంకటేశ్వర అధ్యక్షత వహించగా డా॥ గోపాల్ శర్మగారు సంచాలకులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం జరిగిన చర్చలో బెంగాలీ, సింధీ, ఉర్దూ, గుజరాతీ మరియు మరాఠీ సాహిత్యంలోని స్త్రీ పై ప్రొ॥ మీనాక్షీ ముఖర్జీ, శ్రీ జె. గిలానీ, శ్రీమతి జమిలా నిషాత్, ప్రొ॥ కిషోర్ లాల్ వ్యాస్ మరియు డా॥ కంచన్ జత్కర్లు పాల్గొన్నారు. ఈ సభకు శ్రీమతి కవితావాచక్నవి సంచాలకులుగా వ్యవహరించగా శ్రీ మట్టమర్రి ఉపేంద్ర గారు అధ్యక్షత వహించారు.

సమకాలీన భారతీయ సాహిత్యంలో స్త్రీ అధ్యయనం సెమినార్ ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన స్వతంత్రవార్త సంపాదకులు డా॥ రాధేశ్యామ్ శుక్ల గారు. మాట్లాడుతూ ఆధునిక స్త్రీ ఉద్యమానికి మూలప్రేరణ పాశ్చాత్య సభ్యతలో ఉందని అయితే అక్కడ పరిస్థితుల కనుగుణంగా స్త్రీ ప్రతీకార భావన ఉదయించినది. అయితే భారతేశంలో స్త్రీ ని మాతృమూర్తిగా గౌరవించబడుతుందని చెప్పారు. అయితే బాధాకరమయిన విషయమేమిటంటే స్త్రీకి ఒక మనిషిగా లభించాల్సిన హక్కులు కూడా లభించటంలేదని చెప్పారు. 21వ శతాబ్దము స్త్రీలదేనని చెప్పుతూ ఇప్పుడు స్త్రీ అధ్యయనం యొక్క ఆవశ్యకతను వివరించారు. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొ॥ మీనాక్షిముఖర్జీ మాట్లాడుతూ ఈ చర్చలన విభిన్న భారతీయ భాషలలోని స్త్రీకి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉచ్చ శిక్షా ఔర్ శోధ్ సంస్థాన్ రిజిస్ట్రార్, డా॥ పి. హెచ్. సేతుమాధవరావు గారు మాట్లాడుతూ 'రాష్ట్రీయ మహత్వ కీ సంస్థాన ' అయినందు వలన ఇటువంటి ప్రయోజనకరమయినటువంటి జాతీయ సెమినార్లను నిర్వహించటం, తద్వారా దేశ ఐక్యతకు తమవంతు సహకరించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. డా॥ కిషోర్ వాస్వాని, భారతీయ సంస్కృతి మరియు స్త్రీని వేరువేరుగా చూడలేమని చెప్పారు.శ్రీ కాజవెంకటేశ్వరరావుగారు స్వాతంత్య్రానంతరం స్త్రీల స్థితి అధ్వాన్నమయిపోయినదని దీనిని రూపుమాపడానికి అందరూ ప్రయత్నించాలని చెప్పారు. శ్రీ చేకూరి కాశయ్యగారు మాట్లాడుతూ స్త్రీ పురుషుల బేధభావాన్ని రూపుమాపాలని చెప్పారు.

ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి ప్రారంభించబడిన 'కర్పూర వసంతసమ్మాన్' అవార్డును రిజిస్ట్రార్ డా॥ పి.హెచ్. సేతుమావరావు, ప్రొ॥ మీనాక్షీ ముఖర్జీ చేతుల మీదుగా హైదరాబాద్కు చెందిన కవి ద్వారకా ప్రసాదమాయచ్కు -2004 - కర్పూర వసంతసమ్మాన్ను ప్రదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సభ ధార్వాడ్ కేంద్రం ప్రొ॥ దిలీప్ సింగ్ గారికి సన్మానం చేశారు. ప్రొ॥ ది దిలీప్ సింగ్ గారు భారత ప్రభుత్వం తరుపున బబుఖారెస్ట్ విశ్వవిద్యాలయం (రొమానియా) కు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళుతున్న సందర్భంగా ఈ సన్మానాన్ని శ్రీ కాజవెంకటేశ్వరరావు, శ్రీ చేకూరి కాశయ్య, డా॥ పి.హెచ్. సేతుమాధవరావు మరియు శీర్ల ధనుంజయుడు గార్లు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పరిశోధనా విద్యార్థులు, అధ్యాపకులు తమ శుభాకాంక్షలను ప్రొ॥ దిలీప్ సింగ్ గార్కి అందజేశారు.

సభ ముగింపు సమావేశంలో ఈ సెమినార్ కు సంచాలకులుగా వ్యవహరించిన శ్రీమతి కవితావాచక్నవి, డా॥ గోపాల్ శర్మ, శ్రీమతి యన్.లక్ష్మి, డా॥ ఋషభ్ దేవ్ శర్మ మరియు నారాయణ రాజు లకు మెమెంటోలు బహూకరించారు. విద్యార్థివిద్యార్థినుల జాతీయగీతాలాపనతో సభ ముగిసినది.




రిపోర్ట్ సమర్పణ -

డా॥ యస్.వి.యస్. యస్. నారాయణ రాజు

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी