ఆధునిక నాటక బ్రహ్మ మోహన్ రాకేశ్







ఆధునిక నాటక బ్రహ్మ మోహన్ రాకేశ్

Dr. S V S S Narayana Raju

సంపాదకీయం

స్రవంతి,

ద్విభాషా మాస పత్రిక, డిసెంబర్ – 2004.

संपादकीय,

स्रवंति,

द्विभाषा मासिक पत्रिका, दिसंबर – 2004.




హిందీ సాహిత్య జగత్తులో అత్యంత ప్రతిభావంతుడైన మోహన్ రాకేశ్ విభిన్న సాహిత్య ప్రక్రియలలో తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. మోహన్ రాకేశ్ నాటకము, నవల, కథ, విమర్శ, ఏకాంకి, బీజ్ నాటక్, పార్శ్వ నాటక్ మరియు విభిన్న సాహిత్యక ప్రక్రియలలో తనదైన ముద్ర వేసిన మహా మనిషి, మోహన్ రాజేశ్ పంజాబు రాష్ట్రంలోని అమృత్సర్లో జనవరి 8, 1925వ సంవత్సరమున జన్మించాడు. 16 ఏళ్ళ ప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన కారణంగా కుటుంబ బాధ్యతలు ఆయన భుజస్కంధాలపై పడ్డాయి. మోహన్ రాకేశ్ యొక్క స్వతంత్ర భావాలు మరియు వ్యక్తిత్వం కారణంగా ఎన్నో ఉద్యోగాలు చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఇమడలేక పోయాడు. మోహన్ రాకేశ్ కు యాత్రాజీవనమంటే అత్యంత ప్రీతి. ఈ కోరికే ఆయన మొత్తం భారత దేశాన్ని చుట్టి రావడానికి కారణం. మోహన్ రాకేశ్ కు నాలుగువైపులా ఉన్న మిత్రులు ఆయన గురించి మాట్లాడుతూ "మోహన్ రాకేశ్ మంచి రచయిత మరియు చెడ్డ మనిషి" అని ప్రచారం చేశారు.

హిందీ నాటక రంగం మరుగున పడుతున్న దశలో రంగస్థలము, నటుడు, దర్శకుడు మరియు ప్రేక్షకుడిని కలుపుటకు కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించిన మహోన్నత రంగస్థల ప్రేమికుడు మోహన్ రాకేశ్. ఆయన రచనలు చాలా ఖ్యాతిని గడించాయి. ఆయన రచించిన నాటకాలు అనేక నగరాలలో టిక్కెట్టుతో అనేక రోజులపాటు వరుసగా ప్రదర్శించబడటమే ఆయన నాటకతృష్ణకు నిదర్శనము. కథావస్తువు కనుగుణంగా రంగస్థలాన్ని మరియు ఆయన ప్రయోగించిన సరికొత్త నాట్యభాష మోహన్ రాజేశ్ ను ఆధునిక నాటక బ్రహ్మగా ప్రతిష్టించాయి. మోహన్ రాకేశ్ నిరంతరం నాటకమే తన జీవితంగా భావించి హిందీ నాటకాన్ని తిరిగి పునరుజ్జీవింపచేయటమే కాక అనేక మంది నాటక ప్రియులకు పునరుత్సాహితులను చేసింది.

మోహన్ రాకేష్ నెహ్రూ ఫెలోషిప్ పై "నాటకంలో సరియైన శబ్ద అన్వేషన్" (नाटक में सही शब्ध की खोज) పైన పరిశోధన చేస్తుండగా విధి వక్రించి 3 డిసెంబర్, 1972న పరమపదించారు. మోహన్ రాకేశ్ హిందీ నాటక రంగానికి ఒక ధృవతార. మోహన్ రాకేశ్ రచనలను చూసినట్లయితే ఆయన చేసిన ప్రయోగాలు తెలుస్తాయి.

ముఖ్య రచనలు :

(1) ఆషాఢ కా ఏక్ దిన్:

(2) లహరోం కే రాజహంస్

(3) ఆధే-అధూరే

(4) పైర్ తలే కీ జమీన్ (అసంపూర్ణ రచన)

(5) అండె కే ఛిల్కే అన్య ఏకాంకీ తథా బీజ్ నాటక్

(6) రాత్ బీత్నే తక్ తథా అన్య ధ్వని నాటక్

నవల, కథ, వ్యాసములు, విమర్శలు, యాత్రలు, సంస్కరణ మొదలగునవి.

డా. నారాయణరాజు

సహ సంపాదకులు

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी