స్త్రీ అధ్యయనం (WOMEN'S STUDY)











స్త్రీ అధ్యయనం (WOMEN'S STUDY)

Dr. S V S S Narayana Raju

సంపాదకీయం

స్రవంతి,

ద్విభాషా మాస పత్రిక, ఏప్రిల్ – 2004.

संपादकीय,

स्रवंति,

द्विभाषा मासिक पत्रिका, अप्रैल – 2004.



సాహిత్యం సమాజానికి ప్రతిబింబం వంటిది. సామాజిక పరివర్తన ప్రజలలో మార్పువలన వస్తుంది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినట్లయితే సాహిత్యం యొక్క విషయము మరియు శైలిలో కూడా మార్పు వస్తుంది. ఆధునిక సాహిత్యంలో స్త్రీ అధ్యయనం (Women's study) కూడా ఈ విధముగానే వచ్చింది. 
వేయి సంవత్సరాల క్రితం హిందీతోపాటు అన్ని ఆధునిక భారతీయ భాషలు ఒక సుద్బఢమైన భాషలుగా రూపుదిద్దుకోవడం ప్రారంభమయినది. అప్పటికి భారతదేశం తన గౌరవప్రదమైన స్వర్ణయుగపు పతనానికి అంచున ఉండడమే కాక విదేశీ దురాక్రమణదారుల అత్యాచారాలకు బలి అవుతున్న సమయము. పూర్తిగా యుద్ధవాతావరణం అలుముకొన్న సామంతవాద పరిస్థితులలో ముఖ్యంగా రెండు ప్రవృత్తులు ఉద్భవించాయి. 1. భోగవాదము 2. వైరాగ్యము. ఈ రెండింటికీ కేంద్ర బిందువు స్త్రీ ఒకదానిలో స్త్రీ భోగ్యవస్తువు. రెండవదానిలో పూర్తిగా నిరాకరించబడినది. మొత్తంమీద ఆ కాలంలో ప్రధానమైనది. ఒక విపణివస్తువు. ఇదే విషయము అప్పటి సాహిత్యంలో ఒక వైపు స్త్రీల కొరకు యుద్ధాలు చేస్తుంటే రెండవ వైపు స్త్రీ నరకానికి ద్వారంగా ప్రకటించబడినది. అటువంటి పరిస్థితులలో స్త్రీ అధ్యయనానికి అవకాశమే లేదు. కాని భక్తి కాలంలో మీరా వంటి కవయిత్రి దీనికి నాంది పలికినది. మీరా పరమభక్తురాలు.. గిరిధర్ గోపాలునికి ప్రేమిక. అయితే ఈమె భక్తిలో ఉన్నటువంటి ఒక ముఖ్య విషయము తులసీదాస్, సూరదాస్, కబీర్ మరియు జాయిసీల సాహిత్యంలో లేదు. అయితే ఆ ముఖ్యమైన విషయం ఏమిటి? అది పురుష ప్రధాన వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకైక స్త్రీ సాహన సంఘర్షణ. ఆమె వివాహితురాలు. కాని ఆమె 'మేరే తో గిరిధర్ గోపాల్ దూసరో న కోయీ! జాకే సిర్ మోర్ ముకుట్ మేరేపతి సోయీ" అని ప్రకటించింది.

మీరా యొక్క ఈ ప్రకటన ముఖ్యంగా స్త్రీ యొక్క స్వాతంత్ర్యానికి ఒక ప్రతీక, మధ్యకాలంలో హిందువులు మరియు ముస్లిములు, రాజులు మరియు ధనవంతులు విలాసాలకు లోనై స్త్రీని తమ దర్బారును అలంకరించే ఒక అలంకారంగా చూడడం జరిగింది. మీరాలాగే ఇంకొక స్త్రీలో కూడా ఇదే విధమయినటువంటి దృక్పథము కన్పిస్తుంది. ఆ స్త్రీ పేరే తాజ్. తాజ్ జన్మతః ముస్లిం అయినప్పటికీ అన్ని సాంప్రదాయపు కట్టుబాట్లను కాదని "ప్యారేనందలాల్ కుర్బాన్ తేరీ సూరత్ పే, హు తో ముఘలానీ హింద్వానీ హో రహూంగ్ మై" అని ఎలుగెత్తి చాటింది.

కాలచక్రము నిరంతరము పరిభమ్రిస్తూ ఉంటుంది. 19వ శతాబ్దంలో నవజాగరణోద్యమం ప్రారంభమయినది. ఈ వాదము సమాజంలో స్త్రీకి కూడా తనకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉన్నదని తెలిపినది. ఆమెను పతి శవంతో పాటు అగ్నిలోకి నెట్టరాదని ప్రకటించింది. మర్యాద పేరుతో ప్రకృతి సహజంగా లభించిన మానవాధికారమును హరించకూడదు. స్త్రీకి తండ్రి లేక భర్త లేక పుత్రుడు కాక స్వయంగా తన జీవితానికి తనే భాగ్యవిధాతగా రూపొందాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ గత రెండు శతాబ్దాలుగా ఈ ఆలోచనా సరళి వ్యాప్తమవుతుంది. అయితే వాస్తవంగా పురుషాధిక్యంతో కూడిననటువంటి ఈ సమాజంలో ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదన్నది. అక్షర సత్యం. స్త్రీని కూడా ఒక మనిషిగా గుర్తించనంతవరకు సమాజంలో అన్యాయము, అత్యాచారము, బలాత్కారము, విద్రోహము మరియు యుద్ధము మొదలైన వాటి వలన పూర్తిగా స్త్రీకే ఎక్కువ హాని జరుగుతున్నది. ఇప్పుడు పురుషుడు మరియు స్త్రీ అని కాకుండా మనిషి మరియు మనిషిగా సమాన హక్కులతో కూడినటువంటి సమాజదృక్పథము అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

మహాదేవివర్మ 'శృంఖలా కి కడియా'లో భారతీయ స్త్రీ యొక్క దుర్గతి మరియు ఆమె శక్తి గురించి గుర్తించే ప్రయత్నంచేసినది. ఇది ఒక విధంగా హిందీలో స్త్రీ అధ్యయనానికి నాంది అనడం ఎంత మాత్రం తప్పుకాదు. 
మహాదేవివర్మ నుంచి కాత్యాయని వరకు స్త్రీ రచనల పరంపరలో ఒక శతాబ్దం నుంచి క్రమముగా ప్రజల మానసిక పరివర్తనను సూచిస్తుంది. భారతేందు హరిశ్చంద్ర నుంచి అరుణ్ కమల్ వరకు సుమారు 150 సంవత్సరాల ఆధునిక సాహిత్యం ఈ మారుతున్న దృక్పధానికి సాక్ష్యము. 21వ శతాబ్దం ప్రారంభంలో సాహిత్యంలో స్త్రీ అధ్యయనం ఒక అత్యంత మహత్వపూర్ణమైన విషయమైనది. 
సమకాలీన భారతీయ భాషల సాహిత్యంలో స్త్రీ అధ్యయనం విషయంపై ఉచ్చ శిక్షా బెర్ శోర్ సంస్థాన్, హైదరాబాద్ కేంద్రంలో మార్చి 15, 16 తేదీలలో దా॥ ఋషఖ్ దేవ్ శర్మగారి నిర్దేశకత్వంలో సమకాలీన భారతీయ సాహిత్య మే స్త్రీ విమర్స్' విషయం పై రెండు రోజుల జాతీయ సెమినార్ జరిగినది. దీని వివరాలు ఈ స్రవంతి సంచికలో మీ కోసం పొందుపరచడం జరిగినది.

డా॥ నారాయణ రాజు

సహ సంపాదకుడు


Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी