ఆకాశంలో సగం





                                             ఆకాశంలో సగం
హిందీ మూలం : డా.ఋషభ్ దేవ్ శర్మ

                                   తెలుగు అనువాదం :  డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు

हिंदी मूल : डॉ. ऋषभ देव शर्मा

तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू 

స్రవంతి, డిశంబరు-2001 

వంటగదికి అంకితమైనారు వారు
అంకితమైనారు వారు
పడకగదిలో బందియైనారు వారు
బందియైనారు వారు
పార్లమెంట్ ముందు నిల్చున్నారు వారు
నిల్చున్నారు వారు.
భ్రమ మీకు
వారు కేవలం సగం జనాభా మాత్రమే నని,
మిగిలిన సగం నిక్షిప్తమై ఉంది వారి గర్భంలో.
వారు పార్లమెంట్ లో ప్రవేశిస్తే,
తారుమారవుతాయి మీ స్టాటిస్టిక్స్
వారిని ఆపటం అనివార్యం.
ఏదో ఒకటి చేయండి,
పార్లమెంట్ ముందే నిలపండి వారిని.
వాళ్ళు బయటే ఉండాలి,
రాజనీతిలో వాళ్ళను ఉపయోగించుకోని,
సరికొత్త, సర్వగ్రాహి పార్ములా,
కనిపెట్టెవరకైనా.
ష్ .........
ఎవరైనా వింటారు.
చుప్ ......
చుప్ రహో ......
మేము ఆలోచనా నిమిగ్నులమై ఉన్నాం,
ఆలోచించనివ్వండి.
చుప్ రహో
మా సూపర్ కంప్యూటర్ ఉపయోగిస్తున్నాం.
చుప్ రహో
మా విష్ణువు, మా ఇంద్రుడు,
తులసీ, అహల్యకోటలకు,
కన్నాలు వేస్తున్నారు.
వేయనివ్వండి.
అంతవరకు,
పార్లమెంట్ వెలుపల ఉన్నవాళ్ళని,
వెలుపలే ఉంచండి.
వాళ్ళని గోల చేయనియ్యండి,
అంతఃకలహాలు సృష్టించండి,
మళ్ళి సలహాకై మనదగ్గరకు రానివ్వండి
రైతుల ఐక్యాన్ని భగ్నం చేశాం మనం,
కూలీలను ఏకం కానివ్వలేదు మనం,
మేధావులను ఒక్కటవ్వనివ్వలేదు మనం,
పెట్టుబడిదారుల స్వార్ధాన్ని భగ్నం చేశాం మనం,
మరి... మరి
సంపూర్ణ భారతావనిని,
అంతఃకలహాల మయం చేశాం
అగ్ర-నిమ్న కులాల పేరుమీద,
ఉన్నవారు – లేనివారి పేరుమీద,
బ్రహ్మణ – మాదిగల పేరుమీద,
హిందు – ముస్లింల పేరుమీద,
నలుపు-తెలుపుల పేరుమీద,
ఎడమ – కుడి – పేరుమీద,
హిందీ – తమిళం పేరుమీద,
పుణ్యస్త్రీ – విధవల పేరుమీద.
సంతానవతి – గొడ్రాళ్ళ పేరుమీద,
అవివాహిత – వివాహిత పేరుమీద,
.......... పేరుమీద,
............ పేరుమీద,
రిజర్వేషన్ల బ్రహ్మముహూర్తంలో,
కలిసిన స్త్రీ ల మద్య,
వేరు-వేరు జెండాలు,
వేరు-వేరు వస్త్రాలు,
తయారు చేసి పంచాం
కాని,
లోపలికి ప్రవేశించి కూడా,
పార్లమెంట్ వెలుపలే ఉన్నారు,
యధాప్రకారం,
వంటింటికి – పడకగదికి,
బందియై పోతారు.      
 

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

लहरों के राजहंस और सुंदरी

“कबीर के दृष्टिकोण में गुरु”