సంపాదించే సతి





సంపాదించే సతి
మణిపురి మూలం : డా. చోం. యామినిదేవి    
मणिपूरि मूल : डॉ. चों. यामिनि देवी
            
  హిందీ అనువాదం : డా. ఈ. విజయలక్ష్మీ
हिंदी अनुवाद : डॉ. ई. विजयलक्ष्मी  
                       
తెలుగు అనువాదం : డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు
             तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू 
   
స్రవంతి, జూలై 2006 

     ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?” అని దేబేన్ అడిగాడు.
 అమ్మకు ఒంట్లో బాగోలేదని తెలిసింది దాంతో ఆఫీసు నుంచి అమ్మదగ్గరకు వెళ్ళి వస్తున్నాను అని బినో జవాబిచ్చింది.
 ఒకసారి అది ఒకసారి ఇది ఏదో వంక నీ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నావు”.
అబద్ధం చెప్పటం లేదు అమ్మని రిక్షా గుద్దింది. ఇప్పటికీ ఆమె కాలి వాపు అలాగే ఉంది
ఈరోజు సరే, నిన్నెందుకు ఆలస్యంగా వచ్చావు?”

 అసెంబ్లీ లో మా విభాగానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. దానికి సంబందించిన జవాబు తయారు చేయటం కోసం ప్రమో, ఇబేయామియా మేమందరం ఉండవలిసి వచ్చింది. ఆలస్యమై నందున వారి వారి భర్తలు వచ్చి వాళ్ళను తీసుకోని వెళ్ళారు. నన్ను తీసుకురావడానికి నీవెందుకు రాలేదు?”.

 దేబేన్ నిరుద్యోగి ఏమి సంపాదించడు. లౌక్యం తెలిసిన వాడవడం వలన సంపాదించే అమ్మాయిని వివాహమాడాడు. భార్యే యింటిని పోషిస్తుంది. ఇతరుల నుంచి తప్పించికోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూంటాడు. అందుకే తన భార్యని ఆఫీసుకి తీసుకుని వెళ్ళడం లేదా తీసుకుని రావడానికి యిష్టపడడు, ఎప్పుడూ ఆ పని చేయడు. ఒకవేళ భార్య కొంచెం ముందు వెళ్ళినా, లేదా ఆలస్యంగా వచ్చిన పోలిసు మాదిరిగా ప్రశ్నలు వేసి బినోని వేధిస్తుంటాడు. బినో మాట వినగానే వెంటనే యిలా జవాబిచ్చాడు.

నిన్ను తీసుకెళ్ళి తీసుకురావడానికి నేనేమైనా నీ నౌకరుననుకున్నావా?”

యిందులో నౌకరు విషయం ఎందుకు? నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నాను. ఇంట్లో వంట చేయటం, గిన్నెలు కడగటం, యిల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం మొదలైన అన్ని పనులు నేను చేస్తున్నాను. ఇవన్నీ నేను నౌకరనుకొని చేస్తున్నానా! ఆలస్యమైనప్పుడు తీసుకురావడానికి రాకపోయినా ఫర్వాలేదు కానీ యింట్లో పనికైన కాస్త సాయం చేయవచ్చు కదా!”

యింటి పని చేయడం, వంట వండడం ఇవన్నీ ఆడవాళ్ళపని. నువ్వు ఆఫీసుకెళ్ళి సంపాదించినంత మాత్రాన నేను యింటి పనిజేయాలా?”

 ఏమి చెప్పినా నువ్వు వినిపించుకోవు కదా! చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు అన్న చందాన నీతో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు అనుకుంటూ నెమ్మిదిగా నువ్వు సంపాదించవు లేకపోతే యింటిని బాబుని నేను చూసుకుంటాను కదా!

 పుండుపై కారం చల్లినట్లై దేబేన్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడై, అలాగే! సంపాదించే పెళ్ళామా ఈ రోజు నుండి నువ్వు యిచ్చిందెది తినను అంటూ అలిగి మంచమెక్కి పడుకున్నాడు. మరునాడు యింటి పని అంతటినీ పూర్తి చేసి ఉరుకుల పరుగులతో ఆఫీసుకు వెళ్ళి వచ్చింది. మరలా వంటింట్లో తన వంట పనినంతటినీ పూర్తి చేసి దేబేన్ ను లేపింది. ఎంత లేపిన లేవలేదు. నిద్రపోతున్న వాళ్ళను లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాళ్ళని ఎవరు లేపగలరు. మరొక మార్గము లేక పిల్లవాడుతో బాటు తనుకూడ నిద్రకుపక్రమించింది. మనుసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి. నిద్ర పట్టడం లేదు పాత జ్ఞాపకాలు తన పెళ్ళికి ముందు చిన్న చిన్నాన్న చావోబా ఒకరోజు ఇలా అన్నాడు బినో యవ్వనంలోని ప్రేమతో కడుపునిండదు అతడు ఏమీ పనిచేయడం లేదు సంపాదించడం లేదు. నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి అంతా సవ్యంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ పురుషుని అహంకారం చాలా ప్రమాదకరమైంది. నీ ఉద్యోగమే నీ కుటుంబం  విడిపోవడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ప్రేమ మత్తు విడిపోతుందో అప్పుడు నీకు యిల్లు మరియు సమాజము యొక్క వాస్తవిక పరిస్థితి అర్థమవుతుంది. యిది బాగా గుర్తుంచుకో

  ఈ రోజున అదే జరిగింది యిప్పుడిప్పుడే బినోకి పరిస్థితి అర్థమవుతుంది. బినో సంపాదిస్తూ ఇంటికి అవసరమయినటువంటివి అన్నీ సమకూర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ దేబేన్  అహంకారం, గర్వం, అధికారం చలాయించాలనే కోరిక  యింటి యజమానిని అనే భావం యింట్లోని శాంతిని దూరం చేసింది. బినో ఎన్నో రోజులు ఆకలితో పడుకోవడమే కాకుండా అనేకసార్లు దెబ్బలు కూడా తిన్నది. మర్నాడు కూడా ఆఫీసులో ఎక్కువ సమయం ఉండవలిసి వచ్చింది. యింటి గురించి తలుచుకుంటూనే గాభరపడుతూ తన సహోద్యోగిని ప్రమోతో యిలా అన్నది, ప్రమో! నేను వేగంగా వెళ్ళాలి నువ్వు ఈ కొంచెం ఈపనిని పూర్తి చేయి. 
               
  ఆగు ఏమంటున్నావు నీవొక్కదానికే తొందరెందుకు మేము వెళ్ళక్కరలేదా! మేము కూడా నెలల పిల్లవాడిని మా అమ్మగారింట్లో వదిలి వచ్చాను. యిప్పుడు మీటింగు జరుగుతుంది. మీటింగు అయ్యేవరకు ఎవరూ యింటికి వెళ్ళకూడదని పై అధికారి ఆజ్ఞ జారీ చేశారు బినో ఏం చేయగల్గుతుంది. ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటుంది. స్త్రీ పురుషులిద్దరూ సమానంగా పనిచేస్తూ సమాన వేతనం పొందుతున్నారు. ఒకే పని చేస్తున్న స్త్రీ పురుషులందరూ మీటింగు అయ్యే వరకు వేచి ఉన్నారు. బినో కూడా ఉండవలిసి వచ్చింది.

 బినో తన లూనాని చాలా వేగంగా నడుపుకుంటూ బయలుదేరంది. గాంధీ హాలు దగ్గరికి వచ్చేసరికి గడియారం లోని సమయం ఎనిమిది చూపిస్తూ గంట కొట్టింది. గడియారంలోకి గంట మోత తన చెవులకి కాకుండా గుండెల్లో మోగింది. యింటికి వచ్చేసరికి పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. గబగబా తలుపు కొట్టింది. కానీ దేబేన్ తలుపు తీయలేదు. చాలా సార్లు తలుపు కొట్టిన తర్వాత దేబేన్ బయటకు వచ్చి వెళ్ళు వెళ్ళు తిరుగుబోతుదానా! యిక్కడ్నుంచి వెళ్ళు అంటూ ఆమెని తోసివేసేశాడు.

 ఏమి చేస్తున్నావు? నేను ఒక్కర్తినే అక్కడలేను. ఆఫీసులో పని ఉంది. అందరితో పాటు ఉన్నాను. కొంచెం ఆలస్యమయింది’.
ఆఫీస్! ఆఫీస్! ఆఫీస్!  ఎప్పుడూ ఆఫీస్. జీతం తీసుకున్నంత మాత్రాన మర్యాదలు మంటగలపాల
నువ్వు చదువుకున్న వాడివి. ఆఫీసులో పని చేసేవాళ్ళ సమస్యలని అర్థం చేసుకోలేవా?” యింక ఏమీ మాట్లాడకుండా దేబేన్ తన యింటి తలుపును వేసుకున్నాడు....

                          X                             X                          X

 బినో కన్నవారింటికి వచ్చి కొన్ని రోజులైంది. లోకుల మాటలనైతే సహించగల్గుతుంది కానీ పిల్లవాడి ఎడబాటుని మాత్రం సహించడం కష్టం గా ఉంది.  ఆమె బాధపడుతుండడం చూసి స్నేహితురాలైన యిబేయామియా యిలా అన్నది.

 బినో బాధపడుతూ ఎన్నిరోజులుంటావు. నీకున్న అధికారాల శక్తిని తెలుసుకుని లాభపడు. చిన్న పిల్లవాడిని నీ దగ్గర ఉంచుకునే హక్కు నీకున్నది. న్యాయస్థానం తలుపు తట్టు.

                         X                             X                          X 

 కౌన్సిలర్ దేబేన్ ని అడిగాడు నీ వాదన ఏమిటని?
నాభార్య నాకనుగుణంగా ఉండటంలేదు. నేను యింక ఆమెతో ఉండదలుచుకోలేదు
మీ యిద్దరు వేరువేరుగా ఉంటే పిల్లవాడి పరిస్థితి ఏమిటి’!
 వాడు నా కొడుకు. తండ్రి తోనే ఉంటాడు
బినో తన వాదనని యిలా విన్పించింది”.

 అతనికి నా పనిపైన నమ్మకం లేదు. తన యిష్టమొచ్చినట్లు మాట్లాడుతూ నన్ను కొడుతున్నాడు. ఎప్పుడూ నన్ను యిబ్బందుల పాలుజేస్తున్నాడు. అందువలన నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను. పిల్లవాడు చిన్నవాడు. అందువలనే నాదగ్గరే ఉండనివ్వండి.
 కౌన్సిలర్ యిద్దరినీ వారిస్తూ యిలా చెప్పాడు.

పెళ్ళింటే ఆట కాదు. ప్రేమ పుట్టగానే పెళ్ళి చేసుకున్నారు. గొడవ పడ్డారు. ఒకరంటే ఒకరికి యిష్టం లేదని విడిపోవాలనుకుంటున్నారు. యిదేలా సాధ్యం? మీ యిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. మీరు వేరుపడితే పిల్లవాని భవిష్యత్తు ఏమిటి? పిల్లవాడిని తల్లిదండ్రుల యిద్దరి ప్రేమ మరియు సంరక్షణ అవసరం. అందువలన మీయిద్దరూ మీ మీ యిష్టయిష్టాలను మరిచి పిల్లవాడి కోసం ఒకడిగా ఉండటానికి ప్రయత్నించండి

 యిద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. వారి నోటివెంట ఒక శబ్దం కూడా వెలువడలేదు. కౌన్సిలర్ చాలాసార్లు ఔనా! కాదా! అని ఏదో ఒక జవాబు చెప్పమన్నాడు. కొంతసేపటికి దేబేన్ మాట్లాడుతూ  ఆమె ఉద్యోగం మాని యింటిని సంభాలిస్తే నేను ఒప్పుకుంటాను.
 మరి నువ్వు నీ భార్యని కొడుకుని ఎలా పోషిస్తావు?”

 నాకు చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. ఏదో ఒక పనిచేసి వాళ్ళని పోషిస్తాను
  మంచిది! మగవాడివి అనిపించుకున్నావు”. అని కౌన్సిలర్ అన్నాడు.

 జీతం తీసుకుంటూ ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవితాన్ని గడపడమా? లేదా పనిమానేసి పిల్లవాడిని చూసుకుంటూ యింటిని సరిదిద్దుకోవడమా? యిప్పుడు బినో ఏమి జవాబు చెబుతుందోనని ఎంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.......            



Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी