ఆహ్వానం






ఆహ్వానం

                                               డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు
స్రవంతి,
సాహిత్య మాస పత్రిక, ఏప్రిల్,1998  
                                                                 
మహోత్సవంగా జరుపుతున్నాం
ఆంగ్ల సంవత్సరాదిని,
భయకంపితులవుతున్నాం,
ఉగాది పచ్చడిని తలస్తూనే
ఎటు వెళ్తున్నాం మనం.
మరుస్తున్నాం మన సంప్రదాయాలను,
విడమర్చి చెప్పాలి అందరికి
ఉగాది నిజమైన పరమార్థాన్ని,
అందుకే
అందరం పలుకుదాం
బహూథాన్య కి ఆహ్వానం
కావాలి మనందరికి శుభదాయకం
జీవితంలో వెలుగు నీడలు,
సుఖ, దుఃఖాలకు ప్రతీకగా
తీపి, చేదు, షడ్రుచుల
ఉగాది పచ్చడిని ఆస్వాదిద్దాం,
తెలుసుకుందాం పంచాంగ శ్రవణంలో
దేశ, జీవన, గ్రహగతులు.
జాతీయ జీవన స్రవంతిలో
తెలుగువారి సమైక్య రాగానికి
ప్రతీక కావాలి ఈ ఉగాది
అందరం పలుకుదాం
బహుధాన్య కి ఆహ్వానం

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी