హే బాపూ ! ఇదీ మన భారతం





హే బాపూ ! ఇదీ మన భారతం

                                         డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు

స్రవంతి, జూలై 1998

నిశిరాత్రిలో స్త్రీ నిర్భయంగా వెళ్ళినరోజు,
మనకి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజు
అన్నాడు మన జాతిపిత బాపూజీ
కాని ఈ ఆధునికి దుశ్శాసునులు,
సభ్య సమాజ సాక్షిగా పట్టపగలు,
జరిపిస్తున్నారు నారీ వస్త్రాపహరణాలు
రచిస్తున్నారు ఎన్నో ఆధునిక మహాభారతాలు,
ఇదీ మన మేరా భారత్ మహాన్
జరుగుతున్నాయి,
స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సంబరాలు,
మిన్నంటి మ్రోగుతున్నాయి ఉత్సవాలు,
జరుపుతున్నాయి బహుళ జాతి సంస్థలు,
దేశాభిమానమనే ముసుగులో,
టీ.వి. ఛానల్స్ లో,
పాప్ సింగర్స్ గొంతుల్లో
నాయకుల సన్మాన సభలలో
ఎక్కడుంది స్వాతంత్ర్యం ఈ దేశంలో
కళ్ళముందే అన్యాయం అక్రమాలు,
ఇదేమిటంటే ఎన్ కౌంటర్ లు,
దోషులవుతున్నారు రక్షక భటులు,
మెసలి కన్నీరొలికిస్తున్నారు మంత్రివర్యులు,
దేవుడికే పెడుతున్నారు శఠగోపాలు,
కొల్లగొడుతున్నారు దేవాలయాలు,
బాపూజీ మధ్యపానం వద్దన్నారు,
నాయకులు మధ్యపానం ముద్దంటున్నారు,
బహిరంగంగా లైసెన్స్ లిస్తున్నారు
గాంధీజీ వారసులంటున్నారు
వల్లిస్తున్నది గాంధీ మంత్రం
చేస్తున్నది బ్రాందీ వ్రతం
హే బాపూ!
ఇదీ మన భారతం.       

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी